తెలంగాణ

టీఆర్‌ఎస్‌కు తొత్తుగా ఈసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: ఎన్నికల సంఘం టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పనిచేసిందని కాంగ్రెస్ నాయకులు దుయ్యబట్టారు. ఓట్లు అన్యాయంగా తొలగించారని ఈసీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌కుమార్ విమర్శించారు. అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతూ తరించారని ఈసీ అధికారులపై ఆయన విరుచుకుపడ్డారు. ఈసీ రిమోట్ టీఆర్‌ఎస్ చేతిలో ఉందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. దాదాపు 25 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. కాగా ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన నేతలు, కార్యకర్తలకు కాంగ్రెస్ నేత సంపత్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసమస్యలపై ఇక ముందూ పనిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా భీమ్‌భరత్‌ను నియమిస్తూ పీసీసీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. భీమ్‌భరత్ గతంలో జనశక్తి గ్రూపులో పని చేశారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న దాసోజు శ్రావణ్‌కుమార్, సంపత్‌కుమార్