తెలంగాణ

ఎంపీ పదవికి బాల్క సుమన్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు బాల్క సుమన్ తన పదవికి రాజీనామా చేశారు. పార్లమెంట్‌లో సోమవారం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలిసిన సుమన్ రాజీనామా లేఖను అందజేశారు.
టీఆర్‌ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, వినోద్ కుమార్, గెడ్డం నగేష్, ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి స్పీకర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ముందుగా బాల్క సుమన్ పార్లమెంట్ సమావేశాలకు హాజరైన అనంతరం రాజీనామా లేఖను స్పీకర్‌కు సమర్పించారు. ఎమ్మెల్యేగా గెలిచినందకు సుమన్‌కు స్పీకర్ మహాజన్ అభినందనలు తెలిపారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం నుంచి భారీ మెజరీటీతో సుమన్ గెలిచారు. దీంతో ఆయన ఎంపీ పదివికి రాజీనామా చేశారు.
మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన మల్లారెడ్డి ఇంతకుముందే ఎంపీ పదవికి రాజీనామా సమర్పించారు. మల్లారెడ్డి రాజీనామాను ఆమోదించినట్టు స్పీకర్ సోమవారం లోక్‌సభలో ప్రకటించారు.