తెలంగాణ

చీరల పంపిణీకి సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, డిసెంబర్ 18: బతకుమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయదలచిన చీరలు ఎట్టకేలకు అందనున్నాయి. శాసన సభకు ముందస్తు ఎన్నికలు ముంచుకు రావడంతో ఎన్నికల కోడ్ కారణంగా రెండు నెలల క్రితం నిలిచిన బతుకమ్మ చీరల పంపిణీ బుధవారం నుండి ప్రారంభం కానుంది. జిల్లావ్యాప్తంగా మహిళలకు చీరలు పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లాకు చేరిన చీరలను జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ గోదాంతో పాటు జిల్లా పరిధిలోని తిరుమలగిరి, నేరుడుచర్ల గోదాంల్లో భద్రపర్చారు. ప్రభుత్వ ఆదేశాలతో వాటిని అధికారులు మండలాల వారీగా గ్రామాలకు చేర్చి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముస్లింలకు రంజాన్ సందర్భంగా, క్రైస్తవులకు క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఏటా దుస్తులను పంపిణీ చేస్తోంది. అయితే మెజార్టీగా ఉన్న హిందువుల పండుగలకు ప్రభుత్వపరంగా ఏం ఇవ్వకపోవడంతో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపధ్యంలో గత ఏడాది నుండి బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ప్రభుత్వం చీరలు పంపిణీ చేస్తోంది. అయితే తొలిసారి చీరల పంపిణీపై పలు విమర్శలు వ్యక్తమైన నేపధ్యంలో ఈసారి చీరల పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ వహించి బతుకమ్మ పండుగకు ముందే మండల కేంద్రాలు, మున్సిపాలిటీలలో పంపిణీ చేయదలచిన చీరలతో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటుచేసి మహిళల నుండి అభిప్రాయాలు సేకరించి ఆ మేరకు చీరలను జిల్లాలకు పంపింది. కాగా, ముందస్తు ఎన్నికల నేపథ్యంలో చీరల పంపిణీకి ఈసీ బ్రేకులు వేయడంతో జిల్లాలకు చేరిన చీరలు గోదాంలకే పరిమతమైపోయాయి. ఈనెల 19 నుండి చీరల పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టింది.
జిల్లాలో 3.66లక్షల మందికి పంపిణీ
సూర్యాపేట జిల్లాలో 475 పంచాయతీలు, ఐదు మున్సిపాలిటీల పరిధిలో 3లక్షల 66,182 మంది మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసేందుకు అర్హులుగా గుర్తించారు. అయితే ఇప్పటికి 3,01,760 చీరలు మాత్రమే జిల్లాకు చేరుకున్నాయ