ఆంధ్రప్రదేశ్‌

బచావత్ తీర్పు ప్రకారమే నీళ్లివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 7: బచావత్ ట్రిబ్యునల్ తీర్పుననుసరించి నీటి కేటాయింపుల ప్రకారం రాష్ట్ర వాటాను కచ్చితంగా కోరుకుంటున్నామని, తెలంగాణకు చెందిన నీటిని కోరుకోవడం లేదని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కెఆర్‌ఎంబి అధికారాలు, పరిధిని రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం నిర్ధారిస్తూ, నోటిఫికేషన్ విడుదల చేయాలని మాత్రమే తాము కేంద్రాన్ని కోరామని అన్నారు. బచావత్ తీర్పు ప్రకారం నీటి వివాదాలకు తావు లేకుండా రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలను కాపాడాలన్నదే తమ ప్రభుత్వ అభిమతమని ఉమామహేశ్వరరావు చెప్పారు. కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేయకపోతే, ఇటీవల ఎపిలో మంచినీటి విషయంలో తలెత్తిన పరిస్థితులే పునరావృతమవుతాయని ఆయన అన్నారు. కేంద్రం, లేదా కేంద్ర జల సంఘం పిలిచినా, పూర్తి సమాచారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఉమ చెప్పారు. కాగా గాలేరు నగిరి సుజల స్రవంతి ద్వారా కడప జిల్లా పులివెందులకు నీరు ఇచ్చే పనులకు ఎవ్వరూ అడ్డుపడద్దని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రాజెక్ట్ 28వ ప్యాకేజీలోని 21.100 కిలో మీటరు నుంచి 21.400 కిలోమీటర్ల వరకూ చేపడుతున్న కాలువ పనులకు అడ్డుతగిలేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని అన్నారు.