ఆంధ్రప్రదేశ్‌

చిన్నమ్మని ఇరుకున పెట్టిన ‘ఇరానీ’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 7: మనకు నచ్చని వారి గురించి ఎక్కువగా మాట్లాడం... వారి పేరును ప్రస్తావించడానికి కూడా ఇబ్బంది పడుతుంటాం. తాజా రాజకీయాల్లో సీనియర్ నాయకులు ఇదే పంథాను అనుసరిస్తున్నారు. అలాంటిది చిరకాల రాజకీయ ప్రత్యర్థిని ఏదైనా సందర్భంలో పొగడాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? తమ రాజకీయ జీవితంలో అలాంటి అవసరం రాకూడదనే చాలామంది నాయకులు భావిస్తుంటారు. కానీ పురంధ్రీశ్వరి మాత్రం అటువంటి పరిస్థితి నుంచి తప్పించుకోలేకపోయారు. విషయానికి వస్తే.. బిజెపి రెండేళ్ల పాలన సందర్భంగా దేశవ్యాప్తంగా ‘వికాస్ పర్వ్’ పేరుతో బిజెపి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. విజయవాడలో మంగళవారం జరిగిన బహిరంగ సభలో కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆమె హిందీ ప్రసంగాన్ని కేంద్ర మాజీ మంత్రి, బిజెపి నాయకురాలు పురంధ్రీశ్వరి అనువదించాల్సి వచ్చింది. బిజెపి, తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు కావడంతో స్మృతి ఇరానీ తన ప్రసంగాన్ని చంద్రబాబు పాలన, ఆయన దీక్షాదక్షతలపై ఫోకస్ చేశారు. చంద్రబాబు, మోదీ ప్రభుత్వాలు దేశాన్ని అభివృద్ధి చేయడానికి నడుంబిగించాయని అన్నారు. దేశాభివృద్ధి కోసం చంద్రబాబు చేస్తున్న కృషి శ్లాఘనీయమని అన్నారు. ఆమె ప్రతి వాక్యంలో చంద్రబాబు పేరును ప్రస్తావిస్తూ వచ్చారు. చంద్రబాబు పేరును ప్రస్తావించడానికి పురంధ్రీశ్వరి చాలా ఇబ్బంది పడ్డారు. నాలుగైదుసార్లు ఇరానీ, చంద్రబాబు పేరును ప్రస్తావించగా పురంధ్రీశ్వరి ఒక్కసారే ఆయన పేరును ఉచ్ఛరించారు. మిగిలిన సమయాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అంటూ అనువాదాన్ని కొనసాగించారు.
చంద్రబాబు పేరును ప్రస్తావించడానికి కూడా ఇష్టపడని పురంధ్రీశ్వరితో ఆయన పేరును పదేపదే ఉచ్చరించేలా ఇరకాటంలో పడేసింది ఇరానీ. అంతటితో ఇరానీ ఆగలేదు. యుపిఎ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలను సంధించారు. యుపిఎ ప్రభుత్వం ఆనాలోచిత విధానాలను అవలంబించిందని, స్వలాభం కోసమే పనిచేశారని, వారు పాలించిన పదేళ్ళలో ఏనాడూ ప్రజల ముందుకు వచ్చి పాలన నివేదికను ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఈ వాక్యాలను కూడా పురంధ్రీశ్వరే అనువదించాల్సి వచ్చింది. విజ్ఞత కలిగిన పురంధ్రీశ్వరి పదవిలో ఉన్నప్పుడు, పదవి లేనప్పుడు కూడా పరులను దూషించలేదు. ప్రభుత్వాలను విమర్శించలేదు. అదే ఆమె గతంలో తను పనిచేసిన ప్రభుత్వానే్న విమర్శించాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడింది. గత యుపిఎ ప్రభుత్వంలో మానవవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన పురంధ్రీశ్వరి, అదే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తన నోటి వెంట చెప్పాల్సి రావడం ఇబ్బందికర పరిణామమే.

విజయవాడలో మంగళవారం బిజెపి
నిర్వహించిన ‘వికాస్‌పర్వ్’ సభలో మాట్లాడుతున్న స్మృతి ఇరానీ. పక్కన పురంధ్రీశ్వరి