ఆంధ్రప్రదేశ్‌

అమరావతిలో హార్వర్డ్, యేల్, స్టాన్‌ఫోర్డ్ వర్శిటీ శాఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 7: ప్రపంచ ప్రఖ్యాతి పొందిన స్టాన్‌ఫోర్డ్, యేల్, హార్వర్డ్ యూనివర్సిటీలు భారతదేశంలో తమ విభాగాలను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాయని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలియచేశారు. ఈ విభాగాలను రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అభ్యర్థనకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును మంగళవారం సిఎం క్యాంపు కార్యాలయంలో స్మృతి ఇరానీ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా సెంట్రల్ యూనివర్శిటీ, గిరిజన యూనివర్సిటీలను ఎపిలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ వర్శిటీల ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తప్పనిసరి అని, వాటికి త్వరగా ఆమోదముద్ర లభించేలా చర్యలు తీసుకోవాలని సిఎం కోరారన్నారు. బడి మానేసిన పిల్లల్ని తిరిగి బడిలో చేర్చాలని, ఇందుకు కేంద్రం సహకరిస్తుందని, బడి నుంచి ఇంటికి, ఇంటి నుంచి బడికి వెళ్లేందుకు రవాణా సదుపాయం కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేస్తున్న విధానం తమకు నచ్చిందని స్మృతి ఇరానీ చంద్రబాబును అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌లో సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు అమలుచేస్తున్న ప్రణాళికలను కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ఈ సమావేశంలో కేంద్ర రవాణా శాఖ సహాయ మంత్రి పి రాధాకృష్ణన్, రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపిలు కొనకళ్ళ నారాయణ, కేశినేని నాని పాల్గొన్నారు.

చంద్రబాబుతో సమావేశమైన కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రాధాకృష్ణన్