ఆంధ్రప్రదేశ్‌

విభజనతో వీధిన పడ్డారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 7: రాష్ట్ర విభజనతో మూడు కళాశాలలకు చెందిన ఆర్కిటెక్చర్ విద్యార్థులు రోడ్డున పడ్డారు. వీటికి హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జెఎన్‌ఎఎఫ్‌యు) అనుబంధ కళాశాలల గుర్తింపును రద్దు చేయడంతో పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. దాదాపు ఆరు నెలలుగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖలోని నరవలో ఉన్న వరహా కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, విజయవాడ, భీమవరంలోని ఆర్కిటెక్చర్ కోర్సు నిర్వహిస్తున్న కళాశాలలు ఉమ్మడి రాష్ట్రంలో అనుబంధ కళశాలలుగా కొనసాగాయి. కానీ విభజన తరువాత ఆ గుర్తింపును రద్దు చేస్తూ నవంబర్ 2015లో ఆయా కళాశాలలకు నోటీసులను ఆ వర్సిటీ జారీ చేసింది.
తమ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని గుర్తింపు కొనసాగించాలని కోరినా, ఆ వర్సిటీ అంగీకరించలేదు. ఆ తరువాత ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లగా జెఎన్‌టియు(కె)కు అనుబంధ కళాశాలుగా గుర్తింపు ఇచ్చేందుకు అంగీకరించింది. కానీ, ఇది మొదటి సంవత్సర ప్రవేశాలకు మాత్రమే పరిమితం చేసింది. దీంతో 2, 3, 4, 5 సంవత్సరం చదువుతున్న దాదాపు 350 మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించాల్సిన పరీక్ష నిర్వహించలేదు. ఆగస్టులో మరో సెమిస్టర్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఆఖరి సంవత్సరం చదువుతున్న వారు పీజీ చేసేందుకు, నాలుగో సంవత్సరం చదువుతున్న వారు ప్రాజెక్టు పూర్తి చేసేందుకు వీలుగా పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. దాదాపు ఆరు నెలల కాలం వృథా కావడంతో తమ విద్యా సంవత్సరం కోల్పోతున్నామని విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరహా కళాశాల విద్యార్థులు అరవింద్, మహేంద్ర, సత్యకాంత్ శర్మ, తల్లితండ్రులు ఫరూఖ్ అమానుల్లా, వేదుల శారద తదితరులు మంగళవారం మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.