ఆంధ్రప్రదేశ్‌

దేశ చరిత్రను తిరగరాశాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 7: దశాబ్దకాలం పాటు అవినీతి.. కుటుంబ పాలన.. స్వప్రయోజనలతో దేశాన్ని అధోగతి పాలు చేసిన కాంగ్రెస్ పాలన నుండి నేడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసేలా బిజెపి ప్రభుత్వం పటిష్ఠ అవినీతి రహిత పాలనను అందిస్తోందని కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతీఇరానీ పేర్కొన్నారు. కేంద్రం ఖర్చు చేసే ప్రతీ పైసా పేదవాడి దరి చేరేందుకు గాను కేంద్రం స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు పోతోందన్నారు. దేశంలో పోర్టులు... రహదారులు... ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేయడం ద్వారా ప్రగతిని సాధించి మెరుగైన వృద్ధిరేటును నేడు సాధించుకోగలుగుతున్నామన్నారు. ఎన్‌డిఎ ఆధ్వర్యంలోని బిజెపి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోనికి కార్యకర్తలంతా ధైర్యంగా తీసుకు వెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. బిజెపి ఆధ్వర్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘వికాస్‌పర్వ్’ పేరుతో సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ దేశానికి ప్రధాన సేవకుడిని నేనే అనే సిద్ధాంతంతో పాలన ప్రారంభించిన ప్రభుత్వం నేడు అన్ని రంగాల్లో అభివృద్ధిని చేసి చూపిస్తోందన్నారు. ముఖ్యంగా ప్రధాన మంత్రి ధన యోజన్, స్వచ్ఛ్భారత్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్య తీసుకురాగలిగామన్నారు. అలాగే మోదీ ఇచ్చిన పిలుపునకు స్పందించి సుమారు కోటి మంది గ్యాస్ రాయితీలను స్వచ్ఛందంగా వదులుకున్నారని, రానున్న రోజుల్లో ఐదు కోట్ల మంది నిరుపేదలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిశ్చయించిందన్నారు. మరో ముఖ్య అతిథి, కేంద్ర సహాయ మంత్రి రాధాకృష్ణన్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా జలరవాణా మార్గాలను అభివృద్ధి చేస్తున్నామని, గత ప్రభుత్వ హయాంలో కేవలం ఐదు జలరవాణా మార్గాలు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుతం బిజెపి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా 106 జలరవాణా మార్గాలను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. వీటిలో అత్యంత ముఖ్యమైనది ఎపిలో కాకినాడ నుండి పాండిచ్చేరి వరకు ఉందన్నారు. 1078 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న దీన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అలాగే జాతీయ రహదారుల అభివృద్ధికి ముందు నుండి ప్రాధాన్యత ఇస్తున్న బిజెపి నేడు రోజుకి 25 కిలోమీటర్ల మేర రహదారి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు త్వరలోనే దీనిని 30 కిలో మీటర్లకి విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 1060 కిలో మీటర్ల మేర జాతీయ రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు, రాజధాని అమరావతిలో 8 ఔటర్ రింగ్ రోడ్లును అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే నగరంలోని బెంజిసర్కిల్ ఫ్లైఓవర్‌ను ప్రజల కోరిక మేరకు నిర్మలా కానె్వంట్ రోడ్డు నుండి రమేష్ హాస్పటల్ వరకు పెంచే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. బిజెపి జాతీయ కార్యదర్శి, మధ్యప్రదేశ్ ఎంపి జ్వోతి ధూర్వ మాట్లాడుతూ బిజెపి చేపడుతున్న అభివృద్ధికి ఎవరూ అడ్డు పడలేరని, దేశ ప్రజల బలం బిజెపికి బలీయంగా ఉందన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎపి కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధి అంతా కేవలం శిలాఫలకాలకే పరిమితమైందన్నారు. సభలో కేంద్ర మంత్రుల ప్రసంగాలను మాజీ కేంద్ర మంత్రి పురంధ్రీశ్వరి అనువదించారు. రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు, ఎంపి గోకరాజు గంగరాజు, బిజెపి నేతలు కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు