ఆంధ్రప్రదేశ్‌

ఎన్నికల హామీలు గాలికొదిలేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం/కడప/కర్నూలు, జూన్ 8: ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై రాయలసీమలోని అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో వైకాపా నాయకులు కేసులు నమోదుచేశారు. అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కేసులు నమోదయ్యాయి. అనంతలో జరిగిన జరిగిన రైతు భరోసాయాత్రలో జగన్ సిఎంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో జగన్‌పై టిడిపి శ్రేణులు కేసులు పెట్టాయి. దీనికి ప్రతిగా వైకాపా నాయకులు బుధవారం సిఎంపై కేసులు రెండు సెక్షన్లు, ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఫిర్యాదు చేశారు. వైకాపా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అనంతపురంలో వైకాపా ఎమ్మెల్యే విశే్వశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, మాజీ ఎంపి అనంత వెంకట్రామిరెడ్డి, హిందూపురంలో నవీన్‌నిశ్చల్ కేసులు పెట్టారు. కడప జిల్లా పులివెందులలో మాజీ ఎంపి వివేకానందరెడ్డి, ఎంపి అవినాష్‌రెడ్డి సిఎంపై కేసులు పెట్టారు. కర్నూలు జిల్లాలో వైకాపా శ్రేణులు పలు చోట్ల సిఎంపై కేసులు నమోదు చేశాయి.
ఉత్తరాంధ్రలో
విశాఖపట్నం: ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసగించారని ఆరోపిస్తూ ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబుపై చీటింగ్ కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈ జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో బుధవారం పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పోలీసు స్టేషన్లకు చేరుకుని, సిఎం హామీల విస్మరణపై ఫిర్యాదులు చేశారు. ఎనిమిది నియోజకవర్గాలతో పాటు రూరల్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో వైకాపా నేతలు ర్యాలీగా తరలివెళ్లి పోలీసుల స్టేషన్లలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారు. విజయనగరం జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి అధ్యక్షతన టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నరసన్నపేటలో ధర్మాన కృష్ణదాస్, టెక్కలిలో దువ్వాడ శ్రీనివాసరావు, పలాసలో జుత్తు జగన్నాయకులు, ఇచ్ఛాపురంలో నర్తు రామారావుతో పాటు పిరియా సాయిరాజ్, పాలకొండలో ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి, రాజాంలో ఎమ్మెల్యే కంబాల జోగులు ఫిర్యాదు చేశారు.