తెలంగాణ

గవర్నర్ నరసింహన్‌కు మండల్ తెలుగు ప్రతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: రాష్ట్ర బీసీ కమిషన్ తెలుగులోకి అనువదించి, ప్రచురించిన మండల్ కమిషన్, హవనూర్, అనంతరామన్ నివేదికలను, బీసీ నోట్ బుక్ (ఇంగ్లీషు) తొలి ప్రతులను గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు శుక్రవారం రాజ్‌భవన్‌లో బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, ఇతర సభ్యులు అందజేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ ప్రజలకు రిజర్వేషన్ల అవశ్యకతకు గల ప్రామాణికమైన మండల్, అనంతరామన్, హవనూర్ కమిషన్ నివేదికలను తెలుగులోకి తీసుకుని వచ్చి బీసీ కమిషన్ గొప్ప పని చేసిందని అభినందించారు. దేశంలో బీసీలకు రిజర్వేషన్ల అమలుకు మూలాధారంగా నిలిచిన ఈ నివేదికలను తెలుగులోకి తేవడం గొప్ప ప్రయత్నమని అన్నారు. ఇటువంటి మంచి కార్యాచరణను భవిష్యత్తులోనూ కొనసాగించాలని గవర్నర్ సూచించారని చైర్మన్ బీఎస్ రాములు ఓఎస్‌డీ పి. సాయిబాబా పేర్కొన్నారు.