తెలంగాణ

కాంగ్రెస్‌లోకి రాములు నాయక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: తమ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం (10వ షెడ్యూలు) కింద అనర్హత వేటు వేయాల్సిందిగా టీఆర్‌ఎస్ దాఖలు చేసిన పిటీషన్‌పై శాసనమండలి (కౌన్సిల్) చైర్మన్ కే. స్వామిగౌడ్ విచారణను చేపట్టారు. కౌన్సిల్‌లో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ మేరకు పిటీషన్ దాఖలు చేశారు. కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్ శుక్రవారం తొలుత కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ రాములు నాయక్‌పై దాఖలైన పిటీషన్‌పై విచారణను చేపట్టారు. ఇరువైపుల (పిటీషనర్, కౌంటర్ పిటీషనర్ల) న్యాయవాదుల వాదనలు చైర్మన్ విన్నారు. పార్టీ ఫిరాయించిన రాములు నాయక్‌పై అనర్హత వేటు వేయాలని పిటీషనర్ తరఫు న్యాయవాది పలు సాక్ష్యాలు అందజేశారు. అయితే గవర్నర్ కోటాలో నియమితులైన తన క్లయింట్ రాములు నాయక్‌పై చర్యలు తీసుకోవడానికి చైర్మన్‌కు అధికారం లేదని కౌంటర్ పిటీషనర్ తరఫు న్యాయవాది తన వాదన వినిపించారు. నియమితులైన ఆరు నెలల్లోగా ఏదైనా పార్టీలో చేరితే గవర్నర్ కోటా కిందకు రాదని పిటీషనర్ తరఫు న్యాయవాది అన్నారు. ఇరువైపుల వాదనలు విన్న చైర్మన్ స్వామిగౌడ్ తీర్పును రిజర్వ్ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్‌లో చేరని ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, భూపతి రెడ్డిలపై చర్య తీసుకోవాల్సిందిగా దాఖలైన పిటీషన్లపైనా విచారణ చేపట్టినప్పటికీ, వాటిని శనివారానికి వాయిదా వేశారు.