తెలంగాణ

హాస్టళ్లకు బకాయిలు చెల్లించండి: ఆర్ కృష్ణయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: రాష్ట్రంలో గత ఏడు నెలలుగా బీసీ హాస్టళ్లకు బడ్జెట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జాతీయ బీసీ సంఘం ప్రెసిడెంట్ ఆర్ కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం బకాయిలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈమేరకు ముఖ్యమంత్రికి ఆయన లేఖ రాశారు. తక్షణం బడ్జెట్ విడుదల చేయాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో దాదాపు 700 బీసీ హాస్టళ్లు ఉన్నాయని చెప్పారు. నిధుల విడుదల నిలిపివేయడంతో వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయని ఆయన అన్నారు.