తెలంగాణ

మే 12న క్లాట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ న్యాయ విద్యా విశ్వవిద్యాలయాలు, ఉన్నత స్థాయి సంస్థలలో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి ‘క్లాట్-2019’ను మే 12వ తేదీన నిర్వహించనున్నారు. మే 20 నాటికి ఫలితాలను విడుదల చేసేందుకు క్లాట్ కమిటీ సన్నాహాలు చేస్తోంది. దరఖాస్తులను జనవరి 13వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. దరఖాస్తులను మార్చి 31వరకూ సమర్పించవచ్చు. అడ్మిట్ కార్డులు ఏప్రిల్ మొదటి వారంలో అందుబాటులోకి తెస్తారు. ఈసారి క్లాట్ పరీక్షను ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించాలని నిర్ణయించారు. నిర్ణీత గడువులోగా గత ఏడాది చాలా మంది ఆన్‌లైన్ పరీక్షలు రాయలేకపోయారు. వివిధ కేంద్రాల్లో కంప్యూటర్లు మొరాయించడంతో అభ్యర్ధులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దాంతో ఈ ఏడాది మాత్రం ఆఫ్‌లైన్‌లోనే పరీక్షలను నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. ఆఫ్‌లైన్ పరీక్ష మే 12వ తేదీ మధ్యాహ్నం 3 నుండి ఐదు గంటల వరకూ జరుగుతుంది. అభ్యర్ధులు తమ వ్యక్తిగత ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్‌లను వినియోగించుకుని క్లాట్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవల్సి ఉంటుంది. అనంతరం మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని వినియోగించుకుని దరఖాస్తులను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఒకసారి సబ్‌మిట్ చేసిన తర్వాత దరఖాస్తులో ఎలాంటి చేర్పులు , మార్పులకు తావు ఉండదని క్లాట్ కమిటీ స్పష్టం చేసింది. దరఖాస్తులోని వివరాలు, రికార్డుల ప్రకారం వివరాలు పొంతన కుదరకుంటే ఆయా దరఖాస్తులను తిరస్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. దరఖాస్తు ఫీజు కింద ఓబీసీలు 4వేల రూపాయిలు, ఎస్సీ, ఎస్టీలు 3500 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది. యూజీ ప్రోగ్రాంలో చేరేవారు ప్లస్ టు లేదా యూజీ కోర్సులో 45 శాతం, పీజీ ప్రోగ్రాంలో చేరాలనుకునే వారు కనీసం 50 శాతం మార్కులను సాధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. యూజీ ప్రోగ్రాంలో చేరే వారు ఇంగ్లీషు, కాంప్రహెన్షన్, జనరల్ నాలెడ్జి, కరెంట్ అఫైర్స్, మాథ్స్, లీగల్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ ఉంటుంది. యూజీ ప్రవేశపరీక్ష 200 మార్కులకు ఉంటుంది. అందులో ప్రతి సరైన సమాధానానికి ఒక్కో మార్కు, తప్పు రాసిన వాటికి 0.25 మార్కులు కుదిస్తారు. ఇంగ్లీషులో 40 మార్కులకు, జీకేలో 50 మార్కులకు, మాథ్స్‌లో 20 మార్కులకు, లీగల్ ఆప్టిట్యూడ్‌లో 50 మార్కులకు, లాజికల్ రీజనింగ్‌లో 40 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. ఇక పీజీ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. 100 బహుళైచ్చిక ప్రశ్నలు ఇస్తారు. 50 మార్కులకు వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. వ్యాసరూప ప్రశ్నలు రెండు రాయాల్సి ఉంటుంది. ప్రతి సమాధానానికి 25 మార్కులు ఉంటాయి. బహుళైచ్ఛిక ప్రశ్నలకు తప్పు రాస్తే 0.25 మార్కులు కుదిస్తారు. కానిస్టిట్యూషనల్ లా నుండి 40 మార్కులు, ఇతర న్యాయ బోధనాంశాల నుండి 60 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రవేశ పరీక్షల ప్రాతిపదికగానే యూజీ, పీజీ అడ్మిషన్లు జరుగుతాయి.