రాష్ట్రీయం

13న వైకాపా మేధోమథనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 8: అనంతపురం జిల్లాలో నిర్వహించిన రైతు భరోసా యాత్రకు వచ్చిన విశేష స్పందనతో కదం తొక్కుతున్న వైకాపా శ్రేణులకు మార్గనిర్దేశనం చేసేందుకు, వచ్చే మూడేళ్ల పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు సేకరించాలని వైకాపా అధ్యక్షుడు జగన్ నిర్ణయించారు. ఈ నెల 13వ తేదీన విజయవాడలో మేధోమథనం పేరిట విస్తృత స్థాయి సదస్సును నిర్వహించాలని ఆయన పార్టీ రాజకీయ సలహా కమిటీని ఆదేశించారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావడం, ప్రజల్లో ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకుని పార్టీని గ్రామ స్థాయిలో పటిష్ఠం చేసేందుకు ప్రణాళికను ఖరారు చేయనున్నారు. టిడిపి మాదిరిగా వైకాపాకు జిల్లాల్లో పార్టీ నిర్మాణం లేదు. ఇదే ఆ పార్టీకి శాపంగా మారింది. వచ్చే ఆరు నెలల్లో అన్ని జిల్లాల్లో బూత్ స్థాయి నుంచి పార్టీని నిర్మించేందుకు పార్టీలోని సీనియర్ నేతల సేవలను వినియోగించుకోనున్నారు. అలాగే కాంగ్రెస్, టిడిపిలోని అసంతృప్తులను, మాజీ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకునే విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ కేంద్రంగా పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి హైదరాబాద్ నుంచి అమరావతికి ప్రభుత్వ యంత్రాంగం తరలింపు కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో విజయవాడ కేంద్రంగా పార్టీ కార్యకలాపాలను నిర్వహించే విషయమై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా మంగళవారం ఇక్కడ వేరువేరుగా నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో పార్టీ ఎమ్మెల్యే ఆర్‌కె రోజా, మాజీ మంత్రి పార్థసారథి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై దుమ్మెత్తిపోశారు. విజయవాడ సమావేశంలో చంద్రబాబు అవినీతిని బహిర్గతం చేసేందుకు భవిష్యత్తు కార్యక్రమాన్ని ఖరారు చేస్తామన్నారు.