తెలంగాణ

అధ్యక్షా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా పోచారం శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం నాడు శాసనసభ సమావేశం కాగానే ప్రోటం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ స్పీకర్ ఎన్నికను చేపట్టారు. స్పీకర్ పదవికి పోచారం శ్రీనివాసరెడ్డి ఒక్కరే ఆరు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారని, దాంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయిందని ప్రొటం స్పీకర్ ప్రకటించారు. దాంతో సభాపక్ష నేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఎంఐఎం నేత అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, ఈటెల రాజేందర్ పోచారం శ్రీనివాసరెడ్డి వద్దకు వచ్చి స్పీకర్ కుర్చీ వరకూ తోడ్కొని వెళ్లారు. తర్వాత ప్రొటం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ నుండి పోచారం శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోచారం శ్రీనివాసరెడ్డిని అభినందిస్తూ ముఖ్యమంత్రి సహా 27 మంది సభ్యులు సభలో మాట్లాడారు. దానికి పోచారం అందరికీ కృతజ్ఞతలు చెబుతూ తెలంగాణ శాసనసభను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు తాను కృషి చేస్తానని పేర్కొన్నారు. సభాధ్యక్షుడిగా తనను ఎన్నుకున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించిన ముఖ్యమంత్రికి, విపక్ష నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆరుసార్లు బాన్స్‌వాడ నుండి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడంతో పాటు అనేక పదవులను అలంకరించే అవకాశం కల్పించిన ప్రజలు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. శాసనసభ నిర్వహణ మహోన్నత కర్తవ్యమని, తనపై అభిమానాన్ని, నమ్మకాన్ని ఉంచినందుకు, ఈ బాధ్యతను అప్పగించినందుకు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. నియమబద్ధంగా, న్యాయబద్ధంగా సభను నిర్వహిస్తానని, అందరినీ సమదృష్టితో చూస్తానని, సక్రమంగా సభను నిర్వహించేందుకు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని పేర్కొన్నారు. సభ నిర్వహణ అత్యంతకీలకమైనదని, సంక్లిష్టమైనదని, సభకూ సమాజానికీ తాను వారధిగా ఉంటానని అన్నారు. సభ నిర్వహణలో అనేక సమస్యలు ఉంటాయని, అయినా వాటిని ఎదుర్కొని ప్రజాసంక్షేమం దృష్టితో పరిష్కరించుకోవాలని అన్నారు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం గౌరవం కాదని, సభ ఉన్నది ప్రజాసమస్యల పరిష్కారానికే గానీ కీచులాటలకు కాదని పేర్కొన్నారు. సమాజంలో అసమానతలను తొలగించడానికి సభకు వచ్చామని, సభా కార్యక్రమాలను అందరూ కలిసి సజావుగా నడుపుకోవాలని చెప్పారు. సభ్యులు అంతా నైతిక సూత్రాలను పాటిస్తూ విధిని నిర్వర్తించాలని , జవాబుదారీగా వ్యవహరించాలని అన్నారు. అపుడే సంక్షేమ రాజ్యావిష్కరణ సాధ్యమని పేర్కొన్నారు. సభ్యుల మధ్య సమన్వయానికి తాను త్రికరణ శుద్ధితో కృషి చేస్తానని, మీడియా సైతం సహకరించాలని చెప్పారు. తన పట్ల ఉన్న ప్రత్యేక అభిమానానికి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. వ్యవసాయ మంత్రిగా తాను పనిచేసిన సమయంలోనే చేపట్టిన పథకాలు ప్రపంచస్థాయిలోనే పేరుపొందాయని చెప్పారు, అంతకు ముందు కాంగ్రెస్ సభ్యుడు సురేందర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ టీడీపీలో ఉన్న రోజుల్లో ఆయనకు టిక్కెట్ ఇప్పించడంలో సహకరించానే తప్ప ఇపుడు గెలవడంలో కాదని చెప్పడంతో నవ్వులు విరిశాయి.