తెలంగాణ

రిజర్వేషన్ల తగ్గింపునకు నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: గ్రామ పంచాయతీ బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేశారు. మంత్రివర్గ సమావేశం లేకుండా అసెంబ్లీలో పాసైన పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించడం రాజ్యాంగ విరుద్ధమని పిటీషన్‌లో పేర్కొన్నారు. పైగా రాష్ట్రంలో 56 శాతానికి పైగా ఉన్న బీసీలకు 22 శాతం రిజర్వేషన్లు తగ్గించడం మూలంగా బీసీలకు అన్యాయం జరుగుతున్నదని ఆయన తెలిపారు. ఇలా తగ్గించడం వలన 1400 సర్పంచ్ పదవులు, 18 వేల వార్డు సభ్యుల పదవులు బీసీలకు దక్కకుండా పోతాయని ఆయన వివరించారు. అదేవిధంగా త్వరలో జరిగే జెడ్‌పిటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ బీసీలు పదవులు కోల్పోతారని కృష్ణయ్య తన పిటీషన్‌లో పేర్కొన్నారు.