తెలంగాణ

మార్చికల్లా ఉద్యాన వర్సిటీ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: మార్చికల్లా కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన వ్యవసాయ విశ్వవిద్యాలయం పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి పార్థసారథి అన్నారు. ఆ దిశగా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ములుగులో ఏర్పాటు చేయనున్న ఉద్యానవన విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం, పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాల, దాని అనుబంధ విభాగాల పనుల పురోగతిపై శుక్రవారం సంబంధిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్చి నెలాఖరుకు ఎట్టిపరిస్థితుల్లో భవన నిర్మాణ పనులు పూర్తి చేసి అప్పగించాలని ఇంజనీర్లను ఆదేశించారు.
అంతకంటే ముందు మొదట పరిపాలనా భవనాన్ని పూర్తి చేసి ల్యాండ్‌స్కేప్ చేయాలన్నారు. ప్రయోగశాలలు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలన్నారు. దీని కోసం విశ్వవిద్యాలయం అధికారులు, నిపుణులు, శాస్వ్రేత్తలతో సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలని పార్థసారథి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం చేపడుతున్న వ్యవసాయ ఉద్యాన పథకాలకు పరిశోధనాత్మక మేధోమధనం శాస్ర్తియ సలహాలు అందిజేయాలన్నారు. పంటల కాలనీలను ఏర్పాటుకు సర్వేలు నిర్వహించాలన్నారు. దీంతో పెట్టుబడి వ్యయం తగ్గి రైతన్నలకు లాభదాయకంగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు డాక్టర్ ఎం విజయ, డాక్టర్ భగవాన్, డాక్టర్ రవీందర్‌రెడ్డి, డాక్టఱ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన వార్షిక కేలండర్-2019ని ఈ సందర్భంగా పార్థసారథి ఆవిష్కరించారు.