రాష్ట్రీయం

సచివాలయం అప్పగింత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9:ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోని ఏపి సచివాలయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి స్వాధీనం చేస్తున్నారా? అక్కడ అరబ్ దేశానికి చెందిన కంపెనీ తెలంగాణ ప్రభుత్వం కోసం భారీ భవనాలను నిర్మించనుందా? ఆ మేరకు బాబు సర్కారు అంగీకరించిందా? ఇది ఏపి ఉద్యోగులను బలవంతంగా విజయవాడకు తరలించే వ్యూహంలో భాగమేనా? 2024 జూన్ 1 వరకూ గడువు ఉన్నప్పటికీ, అన్ని హక్కులూ వదులుకుని సచివాలయాన్ని టీ సర్కారుకు స్వాధీనం చేయడం వెనుక మతలబేమిటి? తాజాగా సచివాలయ తరలింపుపై తెరలేచిన చర్చ ఇది.
హైదరాబాద్‌లోని ఏపి సచివాలయాన్ని, ఒక్క బ్లాక్ మినహా మిగిలినవన్నీ తెలంగాణ ప్రభుత్వానికి స్వాధీనం చేసేందుకు ఏపి ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు ఉన్న ఎల్ బ్లాక్ మినహా.. నార్త్ హెచ్, సౌత్ హెచ్, జె, కె బ్లాకులను తెలంగాణ ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్లు సమాచారం.సీఎం బ్లాకు మినహాయించి, జూలై లోగా మిగిలిన అన్ని బ్లాకులను తెలంగాణ ప్రభుత్వానికి స్వాధీనం చేస్తామని ఏపి ప్రభుత్వం కొద్దికాలం క్రితమే తెలంగాణ ప్రభుత్వానికి వౌఖిక హామీ ఇచ్చినట్లు సమాచారం. సచివాలయంలో ఒక్క బ్లాక్‌తోపాటు తక్కువ సంఖ్యలో సిబ్బందిని ఉంచుకుని, మిగిలిన వాటిని స్వాధీనం చేయాలని ఏపి ప్రభుత్వం భావిస్తోంది. నిజానికి 2024 జూన్ 1 వరకూ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నందున, అప్పటివరకూ సచివాలయాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ ఏపి ప్రభుత్వం హడావిడిగా ఖాళీ చేయడానికి సిద్ధమవడం వెనక, వ్యూహాత్మక ఎత్తుగడ ఉందన్న చర్చ ఉద్యోగ వర్గాల్లో జరుగుతోంది.జూన్ 27లోగా ఏపి సచివాలయ ఉద్యోగులంతా, విజయవాడకు తరలిరావలసిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, అక్కడ తగిన సౌకర్యాలు లేవని, స్థానికత అంశంలో ఇంకా స్పష్టత రాలేదన్న కారణాలతో విజయవాడ వెళ్లేందుకు ఉద్యోగులు వెనకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో సచివాలయంలోని బ్లాకులను జూలై లోగా తెలంగాణ ప్రభుత్వానికి స్వాధీనం చేస్తే, ఉద్యోగులు విజయవాడకు రావడం అనివార్యమవుతుందన్న వ్యూహంతోనే, ఏపి ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఉద్యోగ సంఘ నేతలు అనుమానిస్తున్నారు. ఇదిలాఉండగా, ఏపి ప్రభుత్వం సచివాలయాన్ని ఖాళీ చేస్తే, అక్కడ వాణిజ్య అవసరాల కోసం బహుళ అంతస్ధులు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ మేరకు అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన కంపెనీతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు ప్రచారం జరిగింది.
లేఖ రాలేదన్న తెలంగాణ సీఎస్
కాగా ఏపి సచివాలయం ఖాళీ చేస్తున్నట్లు తనకు ఏపి సీఎస్ టక్కర్ నుంచి ఎలాంటి లేఖ రాలేదని తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మ తనను సంప్రదించిన వారితో వ్యాఖ్యానించారు. కాగా హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయం బ్లాక్‌లను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయిస్తూ ఎలాంటి లేఖా రాయలేదని ఏపి ప్రభుత్వ మీడియా సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ తెలిపారు.