ఆంధ్రప్రదేశ్‌

రెండో రోజుకు ముద్రగడ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 10: కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో కొనసాగిస్తున్న దీక్ష శుక్రవారం నాటికి రెండో రోజుకు చేరుకుంది. కిర్లంపూడిలో ఆమరణ దీక్షను భగ్నం చేసిన అనంతరం ముద్రగడను పోలీసులు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించిన నేపథ్యంలో అక్కడ వైద్య పరీక్షలను నిరాకరించారు. ఆసుపత్రిలో వైద్యులు ఎంత నచ్చజెప్పినప్పటికీ ముద్రగడ అంగీకరించలేదు. దీంతో అతికష్టం మీద రక్త పరీక్ష నిర్వహించారు. సుగర్ లెవెల్స్ తగ్గుతున్నట్టు శుక్రవారం వైద్యులు ధ్రువీకరించారు. రెండు ప్రత్యేక వైద్య బృందాలు ముద్రగడకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై వైద్యాధికారులు ఎప్పటికప్పుడు ఆరోగ్య మంత్రి కామినేనికి నివేదిస్తున్నారు. స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ రామరాజు కూడా ముద్రగడకు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వచ్చి ఆయన నిరాకరించడంతో తిరుగుముఖం పట్టారు. ముద్రగడ భార్య పద్మావతి, కుమారుడు, కోడలు, ఇతర కుటుంబ సభ్యులు ముద్రగడతోపాటు ఆసుపత్రిలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. జిల్లా అంతటా వైసిపి నేతలను, కాపు నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. 195 మందిపై బైండోవర్ కేసులు పెట్టారు. పి గన్నవరంలో అయిదుగురు రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నారు. ముమ్మిడివరం, గోకవరంలలో ముద్రగడకు మద్దతుగా దీక్షలు కొనసాగుతున్నాయి. కొత్తపేటలో మద్దతు దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కోనసీమలో బంద్ పిలుపు ఇచ్చినా యథావిధిగా బస్సులు తిరిగాయి. ముద్రగడ ఉన్న ఆసుపత్రి చుట్టూ పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరంలో ఆసుపత్రి వద్దకు నాయకులు ఎవరూ రాకుండా పోలీసులు కట్టుదిట్టం చేశారు. ప్రధాన రహదారులు, జంక్షన్లలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. శనివారం రాష్ట్ర బంద్ పిలుపు నేపధ్యంలో భారీ పోలీస్ బలగాలు జిల్లాకు చేరుకున్నాయి. ముద్రగడ ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే రాహుల్ గాంధీని పరామర్శ నిమిత్తం తీసుకొచ్చేందుకు రాజ్యసభ సభ్యుడు విహెచ్ ప్రయత్నిస్తున్నట్టు తెలియవచ్చింది.
chitram...
రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ముద్రగడ

ఆసుపత్రి వద్ద పోలీసులు