ఆంధ్రప్రదేశ్‌

‘తుని’లో సీమ రౌడీలు తూచ్!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్,జూన్ 10: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తుని విధ్వంసం వెనుక రాయలసీమ రౌడీలు ఉన్నారన్న ప్రభుత్వ-అధికార పార్టీ ప్రచారం ఉత్తిదేనా? అదంతా వైసిపి నాయకత్వాన్ని వణికించే ఎత్తుగడలో భాగంగా కొనసాగుతున్న వ్యూహాత్మక మానసిక దాడి మాత్రమేనా?.. ఇప్పటివరకూ జరుగుతున్న అరెస్టుల పర్వం తీరు చూస్తుంటే, ఇలాంటి అనుమానాలే తెరపైకి వస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా తునిలో జరిగిన కాపుగర్జన సభ అనంతర విధ్వంసాల వెనుక రాయలసీమకు చెందిన, ప్రధానంగా కడప, పులివెందుల రౌడీలున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునుంచి హోంమంత్రి చినరాజప్ప వరకూ ప్రచారం చేశారు. దానితో ఆ ఘటన వెనుక నిజంగానే సీమ రౌడీలున్నారన్న భావన జనంలో ఏర్పడింది.
అదే విమర్శను కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, టిడిపిలోని ఇతర కులాల నేతలు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. టిడిపి కాపు ప్రజాప్రతినిధులు, మంత్రులు మరొక అడుగుముందుకేసి.. తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌రెడ్డి పేరును వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చి, ఆయన పాత్రను చర్చనీయాంశం చేశారు. తుని ఘటనలో భూమన పాత్ర ఉందని, ఆయన అరెస్టు తప్పదంటూ ఎంపిక చేసుకున్న మీడియాకు లీకులు కూడా ఇచ్చారు. స్వయంగా హోంమంత్రి కూడా భూమన పాత్రను పేర్కొన్నారు.కానీ, ఇప్పటివరకూ భూమనపై ప్రభుత్వం కనీసం చిన్న కేసు కూడా నమోదు చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది.
తుని సభ రోజున రైలుబోగీ, పోలీసుస్టేషన్ తగులబెట్టిన కేసుల్లో ఇప్పటివరకూ అరెస్టయిన వారిలో రాయలసీమకు చెందిన వారు ఒక్కరూ లేకపోవడం చర్చనీయాంశమయింది. అరెస్టయిన వారిలో తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో ఇద్దరు బీసీలు కూడా ఉండటం మరొక ఆశ్చర్యం. ఇప్పుడు విపక్షాలు దీనినే అస్త్రాలుగా సంధిస్తున్నాయి. గోదావరి జిల్లాల వారు, ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా వారు చాలా మంచివారని, శాంతస్వభావులని, తుని ఘటనలో వారు లేరని ముఖ్యమంత్రి నుంచి హోంమంత్రి వరకూ వాదిస్తూ వస్తున్నారు. ఇదంతా కడప, పులివెందులనుంచి వచ్చినవారు చేసిన పనేనని ఆరోపిస్తున్నారు.
మరి ఘటన జరిగి ఇన్ని నెలలయినా, సీమకు చెందిన ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడం, కనీసం కేసు నమోదు చేయకపోవడం బట్టి, ఇదంతా ముద్రగడకు మద్దతునిస్తున్న పార్టీలను మానసికంగా భయపెట్టే వ్యూహాత్మక ఎత్తుగడగానే అర్థమవుతోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. తుని ఘటనకు,కడపకు లింకు పెట్టడం ద్వారా, ఆ హింస వెనుక వైసీపీ ఉందన్న అనుమానాలు ప్రజల్లో కలిగించడమే టిడిపి నాయకత్వ వ్యూహమంటున్నారు.