తెలంగాణ

కేంద్రంలో కాంగ్రెస్‌దే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న భయంతోనే సీఎం కేసీఆర్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం లేదని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ మధుయాష్కి ఆరోపించారు. గాంధీభవన్‌లో సోమవారం సాయంత్రం కొత్తగా ఏర్పాటు చేసిన టీపీసీసీ మీడియా కమిటీ తొలిసారి భేటీ అయింది. సమావేశం అనంతరం కమిటీ చైర్మన్ మధుయాష్కి మీడియాతో మాట్లాడుతూ, ఉత్తరాదిన జరిగిన శాసనసభ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించాక ప్రజల్లో ఆలోచన మారిందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో కేసీఆర్ పాలన గాడిలో పడుతుందన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే కావడంతో రాష్ట్రం నుంచి 16 మంది టీఆర్‌ఎస్ ఎంపీలు గెలిచినా ఒరిగేది ఏమిలేదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుపీయే ప్రభుత్వం ఏర్పడి, రాహుల్‌గాంధీ ప్రధాని అయితే రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన విభజన హామీలు నెరవేరుతాయన్నారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతున్నామన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి ఇదే ప్రతిపాదనలు వస్తున్నాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేసినా పర్వాలేదు కానీ, శాసనసభ ఎన్నికల్లో మాత్రం టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని సీఎం కేసీఆర్ ప్రచారం చేశారని మధుయాష్కి అన్నారు. ఈ నెల 15కల్లా అన్ని జిల్లాల్లో మీడియా కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. మీడియా సమన్వయం కోసం జిల్లాకు ఒకరి చొప్పున సమన్వయకర్తను నియమిస్తామన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ విజయానికి మీడియా కమిటీ అమితంగా కృషి చేస్తుందన్నారు. బీజేపీకి టీఆర్‌ఎస్, ఎంఐఎం బీ టీమ్ అన్నారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి రాష్ట్రానికి ప్రియాంకగాంధీ రాబోతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ చెక్కు చెదరలేదని, తాము ఏమాత్రం ప్రయత్నం చేయకుండానే 3 వేల మంది సర్పంచ్‌లు గెలిచారంటే అది పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనమన్నారు. పార్లమెంట్ ఎన్నికల మీడియా కమిటీ సభ్యులుగా కప్పర హరిప్రసాద్, పల్లె రవికుమార్, సుధాకర్‌గౌడ్‌ను నియమించినట్టు మధుయాష్కి ప్రకటించారు.