రాష్ట్రీయం

ప్రజారోగ్య పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్(ఖైరతాబాద్): ప్రజా ఆరోగ్య పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం అమీర్‌పేట సెస్ ఆడిటోరియంలో కేఎస్ వ్యాస్ మెమోరియల్ స్మారకోపన్యాసం ఇచ్చారు. ముఖ్య అతిథులుగా శ్రీనాథ్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి హాజరయ్యారు. వ్యాస్ సతీమణి అరుణ వ్యాస్‌తో కలిసి దివంగత వ్యాస్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. శ్రీనాథ్ రెడ్డి ‘ఇండియా రోడ్ టూ యూనివర్సల్ కవరేజ్’ అనే అంశంపై స్మారకోపన్యాసం చేశారు. సమతుల అభివృద్ధికి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ (యూహెచ్‌సీ) రూపొందించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలో నేషనల్ హెల్త్ పాలసీ (ఎన్‌హెచ్‌పీ)ని 2017లో తీసుకువచ్చామని అన్నారు. ఇందులో భాగంగా దేశంలోని ప్రతి పౌరుడు ఆరోగ్యంగా జీవించేందుకు కావాల్సిన పరిస్థితులను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశంలో ఆయుఃప్రమాణం కేవలం 32 ఏళ్లుగా ఉండేదని అన్నారు. వైద్య సేవలు మెరుగుపడటంతో ఆయుః ప్రమాణం పెరిగినా ఆరోగ్యంగా జీవించలేక పోతున్నామని అన్నారు. పట్టణీకరణతో నానాటికి పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఆనారోగ్యాల బారిన పడాల్సి వస్తుందని అన్నారు. పల్లెల నుంచి పట్టణాలకు చేరిన ఐదు సంవత్సరాల్లోనే బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయని చెప్పారు. ఆహార కాలుష్యం సైతం ప్రధాన భూమిక పోషిస్తుండగా, నిషేధిత డ్రగ్స్, పొగాకు వినియోగం, మద్యం వంటి వాటితో ఆరోగ్యాలు క్షిణిస్తున్నాయని తెలిపారు. కల్తీ మద్యం తాగి వందలాది మంది మృత్యువాత పడటం తీవ్ర ఆవేదన కలిగించే అంశం అన్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ కల్తీలు, నిషేధిత మాదక ద్రవ్యాలు, పొగాకు వంటివి సరఫరా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించవచ్చునని అన్నారు. విధి నిర్వహనలో దివంగత వ్యాస్‌ను ఆదర్శంగా తీసుకొని పోలీసులు చిత్తశుద్ధితో పనిచేసి ప్రజల మెప్పు పొందాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా మాజీ పోలీస్ ఉన్నతాధికారులు వ్యాస్‌తో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.
చిత్రం..తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం అమీర్‌పేట సెస్ ఆడిటోరియంలో
జరిగిన కార్యక్రమంలో స్మారకోపన్యాసం చేస్తున్న వ్యాస్ సతీమణి అరుణా వ్యాస్