తెలంగాణ

బయ్యారంలో ‘ఉక్కు’ దీక్ష షురూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, ఫిబ్రవరి 13: బయ్యారం ఉక్కుపరిశ్రమ ఏర్పాటు విభజన చట్టం ప్రకారం చేసి తీరాల్సిందే అని.. సర్వేల పేరుతో కాలయాపన చేస్తే సహించేది లేదని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కుపరిశ్రమ సాధన లక్ష్యంగా 36 గంటల దీక్షను బుధవారం ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియనాయక్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ దీక్ష శిబిరాన్ని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు, జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు జెన్నారెడ్డి జనార్దన్‌రెడ్డి ప్రారంబించారు. ఈ సందర్భంగా వనమా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అధికారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బయ్యారం ఉక్కుపరిశ్రమ అంశంలో హామీల వర్షం కురిపించారన్నారు. విభజన చట్టం ప్రకారం బయ్యారంలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటు తీరాల్సిందేనని కాని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సర్వేలపేరుతో కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల సందర్భంలో తెలంగాణ రాష్టస్రమితి ప్రచార సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్‌లు అవసరం అయితే రాష్ట్ర ప్రభుత్వంమే బయ్యారం ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేస్తుందని ప్రకటించారని, కాని ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడంలేదన్నారు. బయ్యారం ఉక్కుపరిశ్రమ అంశంలో స్పష్టత ఇవ్వకుండా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు తగిన గుణపాఠాన్ని ప్రజలు నేర్పుతారని వనమా వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఉక్కుపరిశ్రమ సాధన కోసం సాగుతున్న పోరాటం నిరంతరం కొనసాగుతుందని, మహబూబాబాద్, కొత్తగూడెంభద్రాద్రి జిల్లాల ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పెంపొందించే బయ్యారం ఉక్కుపరిశ్రమ సాదించుకోవడం ప్రతి ఒక్కరి హక్కు అని అన్నారు. ఉక్కుపరిశ్రమ సాధన ఉద్యమంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కదలిరావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
తుడుందెబ్బ నాయకుల అరెస్ట్
బయ్యారం ఉక్కుపరిశ్రమ ఏర్పాటు కోసం ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియనాయక్ చేపట్టిన దీక్షను అడ్డుకునేందుకు ప్రయత్నించిన తుడుందెబ్బ నాయకులను పోలీసులు అరెస్ట్‌చేశారు. దీక్షా శిబిరం వద్దకు రాకముందే వారిని అరెస్ట్‌చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.