తెలంగాణ

ప్రాంతీయ సమస్యలను పట్టించుకోని కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: దేశంలో వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న ప్రాంతీయ సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం చొరవతీసుకోలేదని, దీంతో ఆయా రాష్ట్రాల్లో విధ్వేషాలు రగులుతున్నాయని ఎంసీపీఐ (యు) జాతీయ సమావేశాల్లో పలువు వక్తలు అభిప్రాయపడ్డారు. దేశంలో పెట్టబడిదారి వ్యవస్థను ప్రోత్సహించడానికి కేంద్రం ప్రయత్నాలు వేగవంతం చేయడంతో స్థానిక సమస్యలు వెలుగుచూస్తున్నాయని ఆ పార్టీ జాతీయ నాయకుడు కామ్రేడ్ ఎండీ గౌస్ అన్నారు. ఎంసీపీఐ జాతీయ సమావేశాలు కేరళలో కొచ్చిలో గత రెండు రోజుగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత ఎండీ గౌస్ మాట్లాడుతూ పెట్టబడి దారి వ్యవస్థనుకుప్రత్యామ్నాయంగా వామపక్ష సంఘటన నిర్మాణమే అందుకు కారణమని అన్నారు. ఉదారవాద, అవకాశవాద శక్తులను తరిమికొట్టడానికి యువత మేల్కొనాలని ఆయన పిలుపు ఇచ్చారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా వామపక్షాల ఐక్యత అవసరం అన్నారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో జరుగుతున్న మారణహోమాలను అరికట్టడానికి కేంద్రం విఫల యత్నం చెందిందని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర ఎంసీపీఐ శాఖ కార్యదర్శి తాండ్రా కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగం పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదని ఆయన విమర్శించారు. ఈ సమావేశాల్లో నేతలు టీఎస్ నారాయణ్, మహేందర్, అశోక్, సుకన్య, ఉపేందర్‌రెడ్డ, సుధాకర్, వెంకన్న పాల్గొన్నారు.