తెలంగాణ

బాసరలో సందడే సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, జూన్ 12: రాష్ట్రంలో చదువుల తల్లి కొలువుదీరిన ఆదిలాబాద్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతిదేవి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగుస్తుండడం, నేటి నుండి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అమ్మవారి ఆశీస్సుల కోసం తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవుదినాన్ని పురస్కరించుకుని వేలాదిగా భక్తులు బాసరకు తరలివచ్చారు. అక్షరాభ్యాసం, దర్శన క్యూలైన్‌లు ఉదయం నుండి అమ్మవారి భక్తులు, చిన్నారులతో కిటకిటలాడాయి. గత మూడు రోజులుగా అమ్మవారి సన్నిధిలో 3 వేల మందికిపైగా చిన్నారులకు ఆలయ అర్చకులు అక్షర స్వీకార పూజలు నిర్వహించారు. ఆదివారం సైతం 865 మంది చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు చేశారు. భక్తులకు కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆర్జిత సేవలు, లడ్డూ ప్రసాదాల ద్వారా ఆలయానికి మూడురోజులకు కలుపుకుని 15 లక్షల రూపాయల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. సుమారు 20 వేల మంది వరకు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.
chitram చిన్నారులతో అక్షర స్వీకార పూజలు చేయస్తున్న భక్తులు