తెలంగాణ

గురుకుల కళాశాలల లెక్చరర్లను పర్మినెంట్ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: గురుకుల జూనియర్ కళాశాల్లో పని చేసే గెస్ట్ లెక్చరర్లను పర్మినెంట్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం గెస్ట్ లెక్చరర్ల రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ప్రకారం జీతాలు పెంచాలన్నారు. గురుకుల జూనియర్ కళాశాల్లో గత కొన్ని సంవత్సరాలుగా 190 మంది గెస్ట్ లెక్చరర్లు పిన చేస్తున్నారని ఆయన తెలిపారు. వీరికి జీతాలు తక్కువగా ఉండడం, ఉద్యోగ భద్రత లేకపోవడంతో హైకోర్టులో కేసు వేయడం జరిగిందన్నారు. కోర్టు గత ఏడాది డిసెంబర్ 6న తీర్పు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఆ తీర్ను అనుసరించి కేసు దాఖలు చేసిన ఆ 29 మందికి మానవతా ధృక్పథంతో ఆలోచించి కోర్టు తీర్పు ప్రకారం ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం వెంటనే అమలు చేయాలని తీర్పు చెప్పిందని ఆయన వివరించారు. రెగ్యులర్ అధ్యాపకుల కంటే బోధన, విద్యా ప్రమాణాలు కాపాడడంలో బాగా కృషి చేస్తున్నారని ఆయన అభినందించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే నెలలోపు తాత్కాలిక ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామని ఎన్నికల ప్రణాళికలో ప్రకటించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, సయ్యద్ గౌస్, నీల వెంకటేష్, శేఖర్, లింగయ్య, జి.అంజి, వేముల రామకృష్ణ, సాంబయ్య, అనంతయ్య, శ్రీనివాస్, గజేందర్, బాలయ్య, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.