తెలంగాణ

నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: హెర్మిసైడ్ టాలరెంట్ (హెచ్‌టీ) పత్తిరకం విత్తనాలను అమ్మకానికి అనుమతి ఇవ్వలేదని, ఈ రకం పత్తివిత్తనం ఏ రూపంలో వ్యాపారులు అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి హెచ్చరించారు. సచివాలయంలో సోమవారం ఆయన ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెచ్‌టీ పత్తి రకం అనేది గ్లైఫోసేట్ కలపుమందును తట్టుకుని ఉండే జన్యుమార్పిడి రకమని తెలిపారు. కొన్ని కంపెనీలు బీటీ-2 (బీజీ-2) పత్తి విత్తనాల రూపంలో హెచ్‌టీ పత్తివిత్తనాలను మార్కెట్లో అమ్ముతున్నారని సమాచారం వచ్చిందన్నారు. కలుపు మందును తట్టుకునే శక్తి హెచ్‌టీ పత్తి పంటకు ఉంటుందని రైతులు మక్కువ చూపిస్తున్నారు. అయితే హెచ్‌టీ హెచ్‌టీ పత్తివిత్తనాలు వాడడంతో వాతావరణం కలుషితం అవుతోందని, జీవ వైవిద్యం దెబ్బతిని, ఇతర హైబ్రీడ్ పత్తివిత్తనాలు కూడా సంకరం అవుతున్నాయని, సాధారణ కలుపు మొక్కలు కూడా సూపర్‌వీడ్స్‌గా మారి ఎన్ని కలుపు మందులు వాడినా తట్టుకునే శక్తి వస్తోందన్నారు. అందుకే హెచ్‌టీ పత్తి విత్తనాలకు కేంద్ర ప్రభు త్వం, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదన్నారు. ఈ పరిస్థితిలో హెచ్‌టీ పత్తివిత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు, వ్యవసాయ శాఖ సంయుక్తంగా విత్తన దుకాణాలను తనిఖీ చేసి, హెచ్‌టీ పత్తివిత్తనం కలిగి ఉంటే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే హెచ్‌టీ పత్తివిత్తనం కొనుగోలు చేయకుండా రైతులను చైతన్యం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కే. కేశవులు, వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, వ్యవసాయ విశ్వవిద్యాలయం రీసెర్చ్ డైరెక్టర్ ఆర్. జగదీశ్వర్‌రెడ్డి, పోలీసు శాఖ నార్త్‌జోన్ ఐజీ వై. నాగిరెడ్డి తధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.