తెలంగాణ

పచ్చి మోసగాడు చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మార్చి 19: తన రాజకీయ లబ్ధికోసం ఎంతకైనా తెగించే పచ్చి మోసగాడు చంద్రబాబు నాయుడని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్‌టీఆర్ ఉన్నత ఆశయాలతో స్థాపించిన పార్టీని బలవంతంగా లాక్కొన్న చంద్రబాబు.. నైతిక విలువల గురించి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. తన స్వార్థ రాజకీయాల కోసం అన్నదమ్ముల్లా కలిసి ఉన్న మాల, మాదిగ మధ్య విద్వేశాలను రెచ్చగొట్టారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన పార్టీ టీడీపీ అని అన్నారు. పూర్తి వ్యతిరేక భావాలు కలిగిన పార్టీతో పొత్తుపెట్టుకొని ఎన్నికల్లోకి దిగుతున్న వ్యక్తిని నమ్మవద్దని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాబోవు ఎన్నికల్లో విజ్ఞతతో వ్యవహరించి చంద్రబాబుకు తగిన విధంగా బుద్ధి చెప్పాలని కోరారు.