తెలంగాణ

బీజేపీలో పెరిగిన జోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ తెలంగాణ బీజేపీలో జోష్ పెరుగుతోంది. మరో ఐదు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ముగియనున్న సమయంలో బీజేపీ ‘గెలుపుగుర్రాల’ను వెదికి పార్టీలోకి ఆహ్వానించడమేగాక, ఆకర్ష మంత్రాన్ని ప్రయోగించింది. లోక్‌సభ ఎన్నికల ప్రకటన వచ్చిననాటి నుండి జరుపుతున్న చర్చలు ఎట్టకేలకు సఫలీకృతం కావడంపై బీజేపీ నేతలు ఉత్సాహంగా ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు డీకే అరుణ బీజేపీలో చేరడంతో పాటు మరో పది మంది కాంగ్రెస్ నేతలతో చర్చలు కొనసాగిస్తున్నట్టు తెలిసింది. ఇతర పార్టీల్లో టిక్కెట్లు దక్కని వారిని, అసంతృప్తితో ఉన్న వారిని , ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వగలరనుకున్న అభ్యర్ధులతో సంప్రదింపులు జరుపుతూ వారికి లోక్‌సభ టిక్కెట్ లేదా రానున్న రోజుల్లో పార్టీ పరంగా ఏదో ఒక పదవిలో కొనసాగించేందుకు వీలుగా గట్టి హామీలు ఇస్తున్నట్టు సమాచారం.బీజేపీ కేంద్ర కమిటీ నాయకులు పలుమార్లు హైదరాబాద్‌కు వచ్చి తీవ్ర నిరాశతో ఉన్న కాంగ్రెస్ నేతలతో మంతనాలు సాగించారు. తాజాగా విజయరామారావు, ముఖేష్‌గౌడ్ తనయుడు విక్రంగౌడ్, సునీత లక్ష్మారెడ్డి, సర్వేసత్యనారాయణ, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి వంటి నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మాజీ మంత్రులు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పలు పార్టీల నేతలు బీజేపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. మహబూబ్‌నగర్, నల్గొండ, మెదక్ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నేతలు అంతా బీజేపీలో చేరనున్నట్టు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల అభ్యర్ధుల జాబితాను బీజేపీ నిన్ననే ప్రకటించాల్సి ఉన్నా మరింత మంది నేతలు పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు ఆశావహంగా ఉండటంతో జాబితా విడుదలలో తాత్సారం జరుగుతోందని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయినా, దాని ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై పడబోదని, ఈసారి నిజంగానే ఆశ్చర్యకరమైన ఫలితాలు తెలంగాణలో రాబోతున్నాయని బీజేపీ జాతీయ నాయకులు ఊరట ఇవ్వడంతో రాష్ట్ర నాయకుల్లో ఉత్సాహం పెరుగుతోంది. పెద్ద ఎత్తున నాయకులు క్యూ కట్టడం కూడా బీజేపీ నేతలను విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటికే తుది జాబితాను సిద్ధం చేసిన బీజేపీ నాయకత్వం కొత్తగా పార్టీలో చేరుతున్న నేతల విజయావకాశాలను దృష్టిలో ఉంచుకుని చేర్పులూ మార్పులూ చేస్తోంది. తుది జాబితాను గురువారం లేదా శుక్రవారం విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.