తెలంగాణ

ఎమ్మెల్యేల్లో వ్యతిరేకతే కారణం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: ఎమ్మెల్యేలు వ్యతిరేకించడం వల్లే నలుగురు సిట్టింగ్ ఎంపీలకు టికెట్‌ను తెరాస అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నిరాకరించినట్టు సమాచారం. చివరి నిమిషాల్లో కొందరి జాతకాలు తారుమారయ్యాయి. కాగా, ఎంపీ అభ్యర్థులుగా టికెట్ దక్కని నలుగురు సిట్టింగ్స్‌లో ఇద్దరికి ఊరట లభించింది. వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. వీరిలో నల్లగొండ సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మల్కాజ్‌గిరి నుంచి ఎంపీ టికెట్ ఆశించిన నవీన్‌రావు ఉన్నారు. నల్లగొండ నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డిని తిరిగి అభ్యర్థిగా బరిలోకి దింపాలని పార్టీ అధినేత కేసీఆర్ భావించారు. అయితే, ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని బరిలోకి దింపడంతో, కొత్త అభ్యర్థికి అవకాశం కల్పించాలని కేసీఆర్ భావించారు. అలాగే పెద్దపల్లి నుంచి వివేక్ వెంకటస్వామికి టికెట్ ఇవ్వనున్నట్టు శాసనసభ ఎన్నికల ప్రచారంలోనే కేసీఆర్ ప్రకటించారు. చివరి నిమిషం వరకు వివేక్‌కే టికెట్ దక్కుతుందని అంతా భావించారు. అయితే ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వివేక్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడంతో, అదే జిల్లా చెన్నూరు నుంచి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన నేతకాని వెంకటేశ్‌ను అదృష్టం వరించింది. ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయనకు చివరి నిమిషంలో టికెట్ లభించింది. చేవెళ్ల నుంచి ఎంపీ టికెట్ ఆశించి కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డికి కూడా టికెట్ దక్కలేదు. ఇక్కడి నుంచి డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డికి టికెట్ లభించింది. ఖమ్మం, మహబూబాబాద్ సిట్టింగ్‌లకు టికెట్ దక్కదని మొదటి నుంచి టీఆర్‌ఎస్ వర్గాల్లో ప్రచారం జరిగినట్టుగానే వీరికి టికెట్ దక్కలేదు. ఖమ్మంలో సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్థానంలో టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావుకు టికెట్ లభించింది. అలాగే మహబూబాబాద్‌లో సిట్టింగ్ ఎంపీ సీతారామ్ నాయక్ స్థానంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే రెడ్యానాయక్ కూతురు, మాజీ ఎమ్మెల్యే మాలోతు కవితకు అవకాశం లభించింది. మహబూబ్‌నగర్‌లో సిట్టింగ్ ఎంపీ జితేందర్‌రెడ్డి స్థానంలో ఎంఎస్‌ఎన్ ఫార్మా కంపెని అధినేత మనె్న శ్రీనివాస్‌రెడ్డికి టికెట్ లభించింది.