తెలంగాణ

కాంగ్రెస్ కంచు కోటలో..మూడోమారు పాగాకు తెరాస యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మార్చి 24: నిత్యం కరువుకోరల సుడిగుండంలో గడుపుతూ, కడుపు చేతపట్టుకుని వివిధ ప్రాంతాలకు వలసలు వెళ్లే మహబూబ్‌నగర్ నియోజకవర్గ ఓటర్లు ప్రతి ఎన్నికల్లో మాత్రం విలక్షణమైన తీర్పును ఇస్తారు. ఒకప్పుడు మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం అంటేనే కాంగ్రెస్‌కు కంచుకోట అనే మాట వినిపించేది. కానీ రానురాను ఇక్కడి ఓటర్లు కాలానికి అనుగుణంగా విలక్షణమైన తీర్పును ఇస్తూ వస్తున్నారు. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేశారు. అప్పట్లో కేసీఆర్‌ను గెలిపించడంతో ఒక్కసారిగా నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పుతో తెలంగాణ ఉద్యమాన్ని బతికించి రాష్ట్రం ఏర్పాటుకు నాంది పలికిందే పాలమూరు ఓటర్లు అని స్వయంగా కేసీఆర్ చెప్పిన మాటలే ఇందుకు నిదర్శనం. దాంతో కాంగ్రెస్ కంచుకోటకు ఇక్కడి ఓటర్లు బద్ధలు కొట్టి విలక్షణమైన తీర్పును ఇచ్చారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఈ నియోజకవర్గానికి 16 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి 11 సార్లు ఓటర్లు పట్టం కట్టారు. రెండు సార్లు జనతాదళ్‌ను సైతం గెలిపించారు. ఒకసారి బీజేపీనీ సైతం అక్కున చేర్చుకున్నారు. ఈ నియోజకవర్గ ప్రజలు విభిన్న తీర్పులు ఇవ్వడంలో సిద్దహస్తులు. పాలమూరు అంటేనే గుర్తుకు వచ్చేవి వలసలు. వలసల జిల్లా అయినా ఇక్కడి నుండి గెలిచి చాలా మంది నేతలు కేంద్రంలో చక్రం తిప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత జరిగిన తొలి పార్లమెంట్ ఎన్నికల్లో పల్లెర్ల హనుమంతరావును పోటీకి దింపాలని ఇక్కడి కాంగ్రెస్ నేతలంతా ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నారు. అయితే, వనపర్తి రాజవంశీయుడైన రాజా రామేశ్వర్‌రావు జవహర్‌లాల్ నెహ్రూకు స్నేహితుడు. అనూహ్యంగా జిల్లా కాంగ్రెస్ నాయకుల తీసుకున్న నిర్ణయానికి బదులు రాజా రామేశ్వర్‌రావు పేరు తెరపైకి వచ్చింది. తొలిసారిగా మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానానికి రాజా రామేశ్వర్‌రావు ఎంపీగా గెలుపొందారు. రామేశ్వర్‌రావు శకం ముగియగానే మెదక్ జిల్లాకు చెందిన డాక్టర్ మల్లికార్జున్ ఇక్కడి నుండి పోటీ చేసి నాలుగుసార్లు ఎంపీగా గెలుపొందారు. కేంద్ర రైల్వేశాఖ మంత్రిగా మల్లికార్జున్ పనిచేశారు. సుదీర్ఘ కాలంపాటు కేంద్రమంత్రిగా కొనసాగిన మల్లికార్జున్ జైపాల్‌రెడ్డి చేతిలో ఓటమి చవి చూశారు. జైపాల్‌రెడ్డిని గెలిపించి ఇక్కడి ఓటర్లు కాంగ్రెస్‌కు చెక్‌పెట్టి విలక్షణమైన తీర్పును ఇచ్చారు. అయితే జైపాల్‌రెడ్డి గెలిచినప్పటికిని 1999లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుండి కాకుండా వేరే జిల్లాకు వెళ్లిపోయి అక్కడ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో మాత్రం బీజేపీ అభ్యర్థిగా జితేందర్‌రెడ్డి గెలుపొందారు. ఈ ఫలితాలు మాత్రం భిన్నమైన తీర్పుకు నిదర్శనం అంటూ అప్పట్లో దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. అయితే 2004 ఎన్నికల్లో స్థానిక నేతలు కాంగ్రెస్‌లో పోటీకి లేకపోవడంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గాంధీభవన్‌లో కోశాధికారిగా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్న విఠల్‌రావును ఎన్నికల బరిలో దింపారు. ఆయన 2004 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. మళ్లీ ఓటర్లు అప్పట్లో కాంగ్రెస్‌కు అండగా నిలిచారు. అనంతరం తెలంగాణ ఉద్యమ సమయంలో 2009లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ప్రొఫెసర్ జయశంకర్ సూచన మేరకు మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దింపారు. ఈ తరుణంలో అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి కేసీఆర్‌ను ఓడించేందుకు మళ్లీ విఠల్‌రావును బరిలోకి దింపగా ఇక్కడి ఓటర్లు కేసీఆర్‌ను గెలిపించి విలక్షణమైన తీర్పును ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ గెలుపులో వలస ఓటర్లే కీలకంగా మారారు. వివిధ రాష్ట్రాల్లో, హైదరాబాద్‌లో కూలీ పని కోసం వెళ్లిన దాదాపు రెండు లక్షల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో వచ్చి తెరాసకు అడంగా నిలవడంతోనే కేసీఆర్ గెలుపొందారని చెప్పకతప్పదు. 2014 ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్ అభ్యర్థి జితేందర్‌రెడ్డి కేవలం 2590 ఓట్లతో మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డిపై గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సైతం వలస ఓటర్లే జితేందర్‌రెడ్డి గెలుపులో కీలకంగా మారారని అప్పట్లో అంతా చర్చ జరిగింది. కానీ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో మూడోసారి ఈ నియోజకవర్గంలో సత్తా చాటాలని టీఆర్‌ఎస్ తమ దూకుడును పెంచింది. కానీ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం సిట్టింగ్ ఎంపీ జితేందర్‌రెడ్డిని పక్కన పెట్టి ఫార్మా కంపెనీ అధినేత మనె్న శ్రీనివాస్‌రెడ్డికి టికెట్ ఇచ్చి రంగంలో నిలిపింది. నియోజకవర్గంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రచారంలో తమ దూకుడు పెంచారు. కాగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ నియోజకవర్గంలో పూర్వవైభం తీసుకురావలని భావిస్తుంది. ఇక్కడి నుంచి అభ్యర్థిగా ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డిని రంగంలోకి దింపింది. గెలుపు కోసం ఆ పార్టీ నాయకులు చెమటోడుస్తున్నారు. మండల స్థాయిల్లో కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తూ పూర్వవైభవం కోసం కృషి చేస్తున్నారు.