తెలంగాణ

ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్‌కి పరీక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 24: పీసీసీ చీఫ్, నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి, భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డిల రాజకీయ భవిష్యత్‌కు ఈ పార్లమెంట్ ఎన్నికలు అగ్నిపరీక్షలా మారాయి. ఈ ఎన్నికల్లో ఉత్తమ్, వెంకట్‌రెడ్డిల గెలుపు ఓటములే వారు రాజకీయ జీవితాలకు మైలురాయిగా నిలువనుండటంతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వ మార్పు విషయమై కూడా కీలకమవుతాయని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా విశే్లషణలు సాగుతున్నాయి. పీసీసీ చీఫ్ ఉత్తమ్ సారధ్యంలో ఉండగానే కాంగ్రెస్‌కు కంచుకోట వంటి సొంత జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాల్లో ఇటీవలి ఎన్నికల్లో తొమ్మిది స్థానాలను కోల్పోయిన కాంగ్రెస్ రాష్ట్రంలో సైతం మహాకూటమి పార్టీల మద్దతు ఉన్నా టీఆర్‌ఎస్ ప్రభంజనానికి చిత్తయింది. దీనికితోడు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో మెజార్టీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ వలలో పడిపోవడం, కాంగ్రెస్ నుండి మాజీ మంత్రులు సైతం పార్టీని వీడటం ఉత్తమ్ నాయకత్వానికి మరింత సవాల్‌గా మారింది. ఈ నేపధ్యంలో పీసీసీ సారథ్యంలో మార్పు జరుగాలన్న వాదన బలం పుంజుకుంటుంది. ఇదే సమయంలో వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానం నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థులుగా ఉత్తమ్, వెంకట్‌రెడ్డిలను రంగంలోకి దించడం వారి రాజకీయ సమర్ధతకు పరీక్షగా మారింది. ఈ ఎన్నికల్లో ఉత్తమ్ ఓడిపోతే ఆయన పీసీసీ సారధ్యం నుంచి తప్పుకోవాలనే డిమాండ్ బలపడటంతో పాటు కాంగ్రెస్ అధిష్టానం ఈ దిశగా ఆలోచించాల్సిన పరిస్థితి కల్పించినట్లవుతుంది. అదే సమయంలో భువనగిరిలో వెంకట్‌రెడ్డి గెలిస్తే బ్రదర్స్ పీసీసీ సారధ్యం రేసులో ప్రత్యామ్నాయంగా నిలువనున్నారు. మల్కాజిగిరి నుండి రేవంత్‌రెడ్డి గెలిచినట్లయితే బ్రదర్స్‌కు పోటీగా పీసీసీ సారధ్య రేసులో ఉంటారని భావిస్తున్నారు.
గెలుపు సాధనకు పోరాటం
నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గెలుపు సాధనకు కాంగ్రెస్ శ్రేణులను కదిలిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో బలమైన వర్గంగా ఉన్న కోమటిరెడ్డి వర్గీయులు ఎంత మేరకు ఉత్తమ్ గెలుపుకు సహకరిస్తారన్నది ప్రశ్నార్ధకంగా ఉంది. అదిగాక ఈ పార్లమెంట్ పరిధిలో కొద్ది ఓట్లతో నెగ్గిన ఉత్తమ్ మినహా మిగతా సూర్యాపేట, కోదాడ, సాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గం వారిగా చూస్తే కాంగ్రెస్ కంటే టీఆర్‌ఎస్‌కు లక్ష ఓట్ల మెజార్టీ దక్కింది. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కొత్త ముఖం వేమిరెడ్డి నరసింహారెడ్డి ప్రత్యర్థిగా ఉన్నప్పటికీ ఆయా అంశాలతో పాటు కేసీఆర్ ఫథకాలు, ఛరిస్మాకు ఎదురొడ్డి గెలిచేందుకు ఉత్తమ్ తీవ్రంగానే శ్రమించాల్సివుంది.అటు భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచినట్లయితే బ్రదర్స్ కోరుకున్నట్లుగా పీసీసీ సారధ్యం రేసులో వారు గట్టి అభ్యర్థులుగా నిలువనున్నారు. వెంకట్‌రెడ్డి గెలుపు సాధనకు ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఉత్తమ్ వర్గీయులు ఎంత మేరకు సహకరిస్తారన్నది సందేహామే. ఎన్నికల వేళ బ్రదర్స్ అనుఛరుడు నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడం, ఉత్తమ్ వర్గీయుడైన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ సైతం తాజాగా కాంగ్రెస్‌కు గుడ్‌బై కొట్టడం వెంకట్‌రెడ్డికి షాక్‌నిచ్చాయి. ఈ పార్లమెంట్ పరిధిలో సోదరుడు రాజగోపాల్‌రెడ్డి గెలిచిన మునుగోడు నియోజకవర్గం మినహా ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి, నకిరేకల్, జనగామ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ కంటే టీఆర్‌ఎస్‌కు 40వేల ఓట్ల మెజార్టీ రావడం, చిరుమర్తి, బూడిదలు కాంగ్రెస్‌ను వీడటం వంటి పరిణామాలతో గెలుపునకు వెంకట్‌రెడ్డి చెమటోడ్చాల్సి వస్తుంది.