తెలంగాణ

పథకం ప్రకారమే ద్రోహిగా ముద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: తనకు టికెట్ ఇవ్వకుండా పథకం ప్రకారమే పక్కకు తప్పించి, కప్పిపుచ్చుకోవడానికి ద్రోహిగా ముద్రవేస్తున్నారని పెద్దపల్లి టీఆర్‌ఎస్ టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎంపీ వివేక్ ఆరోపించారు. శాసనసభ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తికి టికెట్ ఇవ్వడంతోనే ఎవరు ద్రోహం చేశారో తేలిపోయిందని ధ్వజమెత్తారు. పెద్దపల్లి టికెట్ ఆశించి భంగపడిన వివేక్ సోమవారం టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి మరో లేఖ విడుదల చేశారు. టికెట్ ఇవ్వకపోగా కొంతమంది ఆట బొమ్మలతో తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని వివేక్ ధ్వజమెత్తారు. టికెట్ ఇవ్వకపోయినా పోటీ చేయాలని తన అభిమానులు, మద్దతుదారులు కోరుతున్నా వ్యవధి తక్కువగా ఉండటంతో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీలేని పోరాటం చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆహ్వానం మేరకే టీఆర్‌ఎస్‌లో చేరానన్నారు. రాష్ట్రం కోసం పని చేయడం, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లొంగకపోవడం నేను చేసిన ద్రోహమా? పార్టీ పటిష్టత కోసం కష్టపడటం ద్రోహమా? అని వివేక్ ప్రశ్నించారు. 2014లో టీఆర్‌ఎస్‌కు ఇద్దరు ఎంపీలే ఉన్నప్పటికీ మిగిలిన ఎంపీలతో కలిసి జాతీయ పార్టీలను ఒప్పించి బిల్లు ఆమోదం కృషి చేయడమే ద్రోహమా? అని ప్రశ్నించారు. తెలంగాణ సాధనలో కాకా (వెంకటస్వామి) సేవలకు గుర్తింపుగానే ట్యాంక్‌బండ్‌పై విగ్రహం పెట్టారని వివేక్ పేర్కొన్నారు. టికెట్ హామీ ఇచ్చి కూడా ఇవ్వకుండా చేయడానికి కొందరు తొత్తులు ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చినా ఎలాంటి ఆర్థిక ప్రయోజనం పొందకపోగా, దీని వల్ల హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్ష పదవిని పొగొట్టుకోవాల్సి వచ్చిందని వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాత్రలేని వారికి, కనీసం జై తెలంగాణ అని నినాదం చేయని వాళ్లకు టికెట్లు ఇచ్చారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు విరుద్దంగా ఉద్యమకారులను పక్కన పెట్టారని విమర్శించారు. జీవితాంతం తెలంగాణ ప్రజల మేలు కోసం పని చేస్తానని పేర్కొన్నారు.
-