తెలంగాణ

త్వరలోనే మూడో విడత రుణమాఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: వ్యవసాయ రుణ మాఫీకి సంబంధించి మూడవ విడత వాయిదా ను త్వరలోనే చెల్లిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ బ్యాంకర్లకు తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్నందున క్షేత్ర స్థాయిలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సత్వరం రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఖరీఫ్ రుణాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ గురువారం సచివాలయంలో ఆరు ప్రధాన బ్యాంకు అధికారులతో సమావేశం అయ్యారు. బ్యాంకర్లు రైతులకు సకాలంలో రుణాలు ఇవ్వకపోతే ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుండి రుణాలు తీసుకుంటారని దీని వల్ల వారు అధిక వడ్డీల బారిన పడతారని అన్నారు. రైతులకు అర్హత మేరకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారణ రుణం ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు. 2016-17 సంవత్సరానికి 29,101 కోట్ల రూపాయల పంట రుణాలు ఇవ్వాలని నిర్ణయించుకున్న లక్ష్యంలో భాగంగా ఖరీఫ్‌లో 17, 460 కోట్ల రూపాయల వరకు పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు. పంట రుణ మాఫీకి సంబంధించి వడ్డీని రైతుల నుంచి వసూలు చేయరాదని ప్రధాన కార్యదర్శి సూచించారు. వడ్డీ రుణ మాఫీ అంశం ప్రభుత్వానికి బ్యాంకర్లకు సంబంధించిన అంశమని, రైతులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. పంట రుణ మాఫీలో అర్హులైన లబ్ధిదారుల జాబితా బ్యాంకర్లకు పంపించామని తెలిపారు. ఈ జాబితాలోని వారికే పథకం వర్తిస్తుందని తెలిపారు. పంట రుణమాఫీ సంబంధించి రైతుల భూ వివరాల కోసం రెవెన్యూ వారి వెబ్ పోర్టల్‌ను వినియోగించాలని ప్రధాన కార్యదర్శి బ్యాంకర్లకు సూచించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి సి పార్థసారథి మాట్లాడుతూ కొన్ని జిల్లాల్లో బ్యాంకు సిబ్బంది వడ్డీని చెల్లించాలని రైతులపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని వివరాలతో చెప్పారు. ఖరీఫ్ 2016 సంవత్సరానికి సంబంధించి వాతావరణ ఆధారిత పంట బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాల ద్వారా వివిధ పంటలకు చెల్లించాల్సిన ఇన్స్యూరెన్స్ ప్రీమియం చివరి తేదీ వివరాలను బ్యాంకర్లకు అందజేశారు.