తెలంగాణ

స్థానిక సంస్థల్లో ఒంటరి పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట, ఏప్రిల్ 21: రాబోవు స్థానిక ఎన్నికల్లో తెలంగాణ జన సమితి ఏ పార్టీలతో పొత్తుపెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం స్పష్టం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఆదివారం జిల్లా టీజేఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో అప్రజాస్వామ్యంగా కేసీఆర్ కుటుంబపాలన కొనసాగిస్తున్నారని రాజ్యాంగంలోని 11 షెడ్యుల్ ప్రకారం స్థానిక సంస్థలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పాలమూరు ఉమ్మడి జిల్లాలకు సాగునీటిని అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయకపోగా కొత్తప్రాజెక్టు పనులు చేయడం లేదన్నారు. భూ ప్రక్షాళన వల్ల పాత పాసు పుస్తకాలు రద్దు కాగా కొత్తవి చేతికి అందక రైతాంగం ఇబ్బందులను ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. రెవెన్యూ ఉద్యోగులపై పనిభారం పడి సక్రమంగా పనిచేయడం లేదన్నారు. రాజకీయం వ్యాపా రం కాదని గెలిస్తే భూముల కబ్జాలుకాదు ప్రజల కష్టాలను తీర్చాలన్నారు. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఇసుక మాఫియా, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ అనుచరులు బరితెగిస్తున్నా రని అన్నారు. రాజకీయాల్లో ధన ప్రవాహం అధికమైందని కోట్లు ఖర్చు చేసి ఓట్లను అధికార పార్టీ కొంటుందని కోదండరాం ఆరోపించారు. తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని ప్రజలకు జరుగుతున్న అన్యాయం చూసి చలించి వచ్చానని తమ దగ్గర కోట్ల కొద్దీ డబ్బులేకున్నా ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధి, దృఢ సంకల్పం ఉందని అందుకే ప్రలోభాలకు లొంగని తెలంగాణ బిడ్డలు ప్రజల తరపున టీజేఎస్ నాయకులున్నారని అన్నారు. వచ్చిన తెలంగాణ ఒకే కుటంబం చేతిలో బంది అయ్యిందని దొరల గడిలనుండి రాష్ట్రాన్ని విముక్తి కలిగించేందుకు మళ్ళీ ఉద్యమ బాట పట్టానని అన్నారు. అచ్చంపేటలో ఆరు జడ్పీటీసీ 15 ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేస్తున్నామని స్థానిక ఎమ్మె ల్యే గువ్వల బాల్‌రాజ్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నియోజకవర్గ ఇన్‌చార్జి మేడిపూరి ద్రోణాచారి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీజెఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు శ్రీ ఉమా మహేశ్వర ఆలయంలో ఆచార్య కోదండరాం ప్రత్యేక పూజలు నిర్వహించి పాపనాశని గుండంలో స్నానమాచరించారు. ఆలయ చైర్మెన్ కందురు సుధాకర్ శాలువాతో సన్మానించి తీర్థా ప్రసాదాలు అందించారు.

చిత్రం... ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న ఆచార్య కొదండరాం