తెలంగాణ

టీఎస్ ఎమ్సెట్‌కు 2.18 లక్షల దఠఖాస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: రాష్ట్రంలో నిర్వహించే ఏడు ప్రధాన ప్రవేశపరీక్షలకు నేటి వరకూ 3,55,471 దరఖాస్తులు వచ్చినట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి చెప్పారు. ఎమ్సెట్‌కు గత ఏడాది 2,21,064 దరఖాస్తులు రాగా, ఈ ఏడాది ఇంత వరకూ 2,18,177 దరఖాస్తులు వచ్చాయని, అపరాధ రుసుంతో దరఖాస్తు చేసేందుకు గడువు ఉందని అన్నారు. ఎమ్సెట్ ప్రవేశపరీక్ష మే 3 నుండి ఆన్‌లైన్‌లో జరగనుందని చెప్పారు. టిఎస్‌ఈసెట్‌కు గత ఏడాది 27,927 దరఖాస్తులు రాగా, ఈ ఏడాది ఇంత వరకూ 28,196 దరఖాస్తులు వచ్చాయని, ఈ సెట్ పరీక్ష మే 11న జరుగుతుందని వివరించారు. అలాగే ఐసెట్‌కు గత ఏడాది 63,007 దరఖాస్తులు రాగా, ఇంత వరకూ 23,166 దరఖాస్తులు వచ్చాయని, మే 3వ తేదీ వరకూ అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసేందుకు వీలుందని అన్నారు. ప్రవేశపరీక్షను మే 23న నిర్వహించనున్నారు. టిఎస్ ఎడ్‌సెట్‌కు గత ఏడాది 38,698 దరఖాస్తులు రాగా, ఈ ఏడాది 50,836 దరఖాస్తులు వచ్చాయి. ప్రవేశపరీక్ష మే 31న జరుగుతుంది. టీఎస్ పీజీఈసెట్‌కు గత ఏడాది 25,057 దరఖాస్తులు రాగా, ఈ ఏడాది ఇంత వరకూ 10,779 దరఖాస్తులు వచ్చాయి. ప్రవేశపరీక్ష మే 28న జరుగుతుంది. టీఎస్‌పిఈసెట్‌కు గత ఏడాది 4911 దరఖాస్తులు రాగా, ఈ ఏడాది ఇంత వరకూ 5121 దరఖాస్తులు వచ్చాయి. శారీరకదారుఢ్య పరీక్షలు మే 15 నుండి మొదలవుతాయి. టీఎస్ లాసెట్‌కు గత ఏడాది 22291 దరఖాస్తులు రాగా, ఈ ఏడాది 19196 దరఖాస్తులు వచ్చాయి. ప్రవేశపరీక్షను మే 20న నిర్వహించనున్నామని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది మొత్తం మీద 4,02,955 దరఖాస్తులు రాగా, ఈ ఏడాది 3,55,471 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు.