తెలంగాణ

సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇంటర్ పరీక్షల నిర్వహణ వైఫల్యాలపై హైకోర్టు సిటింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర శాఖ గవర్నర్ నరసింహన్‌ను కలిసి డిమాండ్ చేసింది. గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, ఎన్ రామచంద్రరావు, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం లక్ష్మణ్ విలేఖరులతో మాట్లాడుతూ ఇంటర్ పరీక్షల నిర్వహణను ఏ మాత్రం అనుభవం లేని ఒక ఏజన్సీకి ఎలా ఇచ్చారని, దీనిపై విచారణ జరిపించాలని కోరినట్లు చెప్పారు. లక్షలాది మంది తల్లితండ్రులు మనోవేదన చెందారన్నారు. ప్రభుత్వం న్యాయం చేసేవరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవద్దని ఆయన కోరారు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేసే వరకు ఉద్యమిస్తామన్నారు. బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మస్థైర్యం కోల్పోరాదన్నారు. బీజేపీ నాయకురాలు డీకే అరుణ మాట్లాడుతూ మంత్రి, కార్యదర్శిపై చర్యలు తీసుకోకుండా సీఎం ఏం చేస్తున్నారని నిలదీశారు. సమీక్షల పేరుతో సీఎం కాలక్షేపం చేస్తున్నారన్నారు. 9 లక్షల మంది విద్యార్థులతో చెలగాటం ఆడుతున్న సీఎం ఒక్క క్షణం కూడా కుర్చీలో కూర్చునే అర్హత లేదన్నారు.

చిత్రం... ఇంటర్ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యంపై గవర్నర్‌ను కలిసి వినతిపత్రం
సమర్పిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, దతాత్రతేయ, డీకే అరుణ, పొంగులేటి, రామచంద్రరావు