తెలంగాణ

జూలై నుంచి ఐదో విడత హరితహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: జూలై నుంచి ఐదవ విడత హరితహారాన్ని ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీని కోసం ప్రతీ గ్రామంలో ప్రత్యేకంగా నర్సీరీలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. ఈ నర్సరీలకు ఆయా గ్రామ హరితహారంగా నామకరణం చేయాలని సూచించింది. గురువారం సచివాలయం నుంచి ఐదవ హరితహారంపై అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా పంచాయతీరాజ్, అటవీ, వ్యవసాయ శాఖల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్ధాయిలో నర్సరీల ఏర్పాటు, ఉపాధి హామీ నిధులతో అనుసంధానం, ఆగ్రో ఫారెస్ట్రీ ప్రోత్సహంపై జిల్లా అధికారులకు అజయ్ మిశ్రా పలు సూచనలు చేశారు. హరితహారం కోసం ప్రతీ గ్రామంలో ఏర్పాటు చేసే నర్సరీకి అదే గ్రామ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ సూచించినట్టు వివరించారు. నర్సరీలను అటవీ, పంచాయతీరాజ్, వ్యవసాయశాఖ ఏ శాఖ నిర్వహించినా పేరు మాత్రం ఆ గ్రామానిదే ఉండాలన్నారు. ఐదవ హరితహారంలో రోడ్లకు ప్రాధాన్యత ఇచ్చి ఇరువైపులా (అవెన్యూ ప్లాంటేషన్) ఈ ఏడాది పెద్ద ఎత్తునా చింత చెట్లు నాటాలని సూచించారు. ఆగ్రో ఫారెస్ట్రీ కింద గంధం, వెదురు, టేకు, సరుగుడు మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించాలన్నారు. దీని వల్ల చిన్నా, సన్నకారు రైతులకు ఆదనపు ఆదాయం చేకూరాలన్నారు. జిల్లాల వారీగా కలక్టర్ నేతృత్వంలో కమిటీలు సమావేశమై ఐదవ విడత హరితహారం కార్యాచరణ సిద్థం చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, రాహుల్ బొజ్జా, సీఎంఓ ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్ పాల్గొన్నారు.

చిత్రం... సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో
మాట్లాడుతోన్న అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా