తెలంగాణ

డిగ్రీ ప్రవేశానికి ఒకే దరఖాస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కాలేజీల్లో అన్ని కోర్సుల్లో ప్రవేశానికి ఒకే దరఖాస్తు ద్వారా అడ్మిషన్లు చేపట్టే ‘దోస్త్’ ఆన్ లైన్ విధానాన్ని విజయవంతంగా మూడో ఏడాది నిర్వహించబోతున్నట్టు దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. అన్ని యూనివర్శిటీల్లో అన్ని యూజీ కోర్సులో ప్రవేశానికి అభ్యర్ధుల నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి, ఆన్‌లైన్‌లోనే సీట్లను కేయిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 10న జారీ చేస్తామని, అదే రోజు నుండి రిజిస్ట్రేషన్ మొదలవుతుందని అన్నారు. మే 27వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని, తద్వారా ఇంటర్మీడియట్ పున: మూల్యాంకనంలో ప్రయోజనం పొందినవారు కూడా దరఖాస్తు చేసుకునే వీలుందని చెప్పారు. ఈసారి దోస్త్ దరఖాస్తు విధానాన్ని కూడా సరళతరం చేశామని, విద్యార్థులకు మరింత స్నేహపూరితంగా ఉండేలా మార్పులు చేస్తున్నామని ఆయన చెప్పారు. గురువారం సాయంత్రం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ యూజీ అడ్మిషన్లకు ఈ తరహా ప్రయత్నం దేశంలో తెలంగాణలోనే మొదటిసారి చేశామని, మెరిట్ ఆధారంగా, రోస్టర్ ప్రకారం ప్రతి కాలేజీలో రాష్ట్రంలోని 31 జిల్లాల విద్యార్ధులే కాక స్థానికేతరులు కూడా పోటీ పడే అవకాశం దీంతో కలిగిందని అన్నారు. ఫలితాంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల అంతరాలు తగ్గి, అన్ని ప్రాంతాల విద్యార్థులు ప్రతి కాలేజీలో చేరే అవకాశం, వీలు కలిగాయని అన్నారు. గతంలో వెరిఫైడ్ మొబైల్ నెంబర్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోగలిగారని, రానున్న రోజుల్లో మిగిలిన అవకాశాలను కూడా అధ్యయనం చేస్తామని అన్నారు. రాష్టవ్య్రాప్తంగా యూనివర్శిటీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో దాదాపు 76 హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేస్తామన్నారు.

చిత్రం...దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి