తెలంగాణ

రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జన్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిలయ్యామనే ఆవేదనతో ఆత్మహత్యలకు పాల్పడిన 23 మంది బాలికలకు అఖిల పక్ష నేతలు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు ట్యాంక్‌బండ్‌పై క్యాండిల్ ప్రదర్శన నిర్వహించారు. అయితే ముందస్తు అనుమతి లేదనే ఆరోపణలతో అఖిల పక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, కాంగ్రెస్ నేతలు అంజన్‌కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్ సహా కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడినా, అవి ప్రభుత్వ హత్యలేనని వారి కుటుంబాలను ఆదుకోవాలని, పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. పోలీసుల నిర్బంధాన్ని చేధించుకుని అఖిలపక్ష నాయకులు ట్యాంకుబండ్‌పై కొవ్వొత్తులను వెలిగించారు. అఖిల పక్ష నేతల పిలుపులో భాగంగా ట్యాంకు బండ్‌కు ఇరువైపులా పోలీసులను భారీగా మోహరింపచేశారు. అటు లిబర్టీ అంబేద్కర్ విగ్రహం, ఇటు మారియెట్ హోటల్ వద్ద ఎవ్వరినీ రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడి వారిని అక్కడే అరెస్టు చేశారు. అయినా పోలీసులను దాటుకుని చాడా వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్ యాదవ్, కోటూరి మానవతారాయ్,వినోద్‌రెడ్డిలు ట్యాంకుబండ్‌కు చేరుకున్నారు. మరోవైపు అంబేద్కర్ విగ్రహం వద్ద టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ను అరెస్టు చేసి పోలీసులు బేగంబజార్ పీఎస్‌కు తరలించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్, ప్రధానకార్యదర్శి బొల్లు కిషన్, సునీతారావు, సీపీఐ నగర కార్యదర్శి ఈటీ నర్సింహలను కూడా అరెస్టు చేశారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జన్సీ వాతావరణం నెలకొందని చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. కనీసం నివాళులు అర్పించేందుకు కూడా ప్రభుత్వం భరించలేని స్థితిలో ఉందని అన్నారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిజాం పాలన కొనసాగుతోందని చెప్పారు.
ఇంటర్ ఫలితాల్లో అవకతవలకు కారకులైన వారిపై చర్యలు డిమాండ్ చేస్తూ మరణించిన విద్యార్ధులకు నివాళిగా కొవ్వొత్తులతో జనసేన నేతలు నిరసన ప్రదర్శనను ట్యాంక్ బండ్ పై నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన ఇన్‌చార్జి శంకర్‌గౌడ్ సహా పలువురు నేతలను పోలీసులు అడ్డుకుని వారిని నారాయణగూడ పోలీసు స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా కొవ్వొత్తులతో నిరసన తెలియజేద్దాం అనుకుంటే పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం దారుణమని శంకర్‌గౌడ్ పేర్కొన్నారు. ఇంటర్ తప్పిదాలకు కారణమైన విద్యామంత్రిని వెంటనే బర్త్ఫ్ చేయాలని , ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్ధుల కుటుంబాలను ప్రభుత్వం కోటి రూపాయిలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించాలని అన్నారు. నష్టపోయిన విద్యార్థులందరికీ న్యాయం చేయాలని చెప్పారు.
చిత్రం... ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినులకు నివాళిగా ట్యాంక్‌బండ్‌పై కొవ్వొత్తుల ప్రదర్శన చేసున్న సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, కాంగ్రెస్ నేతలు అంజన్‌కుమార్, పొన్నం ప్రభాకర్