తెలంగాణ

పిల్లలు చనిపోతే రాజకీయాలంటారా?: లక్ష్మణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 4: టీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ప్రకటించారు. నిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ, ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని చేస్తున్న ఉద్యమాలను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ నిరంకుశ ధోరణితో సాచివేత ధోరణిని అవలంభించారన్నారు. బీజేపీ చేపట్టిన ఉద్యమానికి విద్యార్థులు, తల్లితండ్రులు, జాతీయ బీజేపీ నేతలు, పార్టీలకు అతీతంగా సంఘీభావం తెలిపారన్నారు. చనిపోయిన పిల్లల కుటుంబాలను పరామర్శిస్తామన్నారు. విద్యార్థులకు న్యాయం చేసే వరకు పోరాటం ఆగదన్నారు. ఇంటర్ బోర్డు వైఫల్యాల వల్ల అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించడం తగదన్నారు. అధికార మత్తులో టీఆర్‌ఎస్ పార్టీ ఉందన్నారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజా సంక్షేమ విధానాల అమలు, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం శ్రద్ధ వహించాలన్నారు. లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తు అని, అందుకే ఉద్యమాలు, నిరాహారదీక్షలు చేయాల్సి వచ్చిందన్నారు. నిరాహార దీక్ష చేసినందుకు నిర్బంధించారన్నారు.