తెలంగాణ

కార్మికులకు అసత్యాలు చెప్పిన కేటీఆర్: వీసీ బోస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: ప్రభుత్వం కార్మికులకు అనుకూలమైనదని పేర్కొంటూ మేడే సాక్షిగా టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అసత్యాలు చెప్పారని ఎఐటీయూసీ ప్రధానకార్యదర్శి వీఎస్ బోస్ ఎద్దేవా చేశారు. మేడే గుర్తింపు పొందిన ఎర్రజెండాను ఎగురవేయకుండా వారి పార్టీ జండా గులాబీ జండాను మాత్రమే ఎగురవేయడం మేడే స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. కార్మిక ఉద్యమాలను కేటీఆర్ అపహాస్యం చేశారని , కార్మికులను తప్పుదోవ పట్టించడానికి చేస్తున్న ప్రయత్నంగా దీనిని కార్మికలోకం అర్ధం చేసుకుంటుందని చెప్పారు. అంగన్‌వాడీల జీతాలు పెంచామని చెబుతున్న కేటీఆర్ వారు సమ్మెచేసినపుడు సమ్మెను విచ్ఛిన్నం చేయడంతో పాటు అంగన్‌వాడీ యూనియన్లకు గుర్తింపు ఇవ్వకుండా కొంత మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలతో వారిని పిలిపించుకుని మాట్లాడలేదా అని నిలదీశారు. రాష్ట్రంలో కనీస వేతనాలను సవరించి 10 ఏళ్లయిందని, ప్రభుత్వం మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోందని అన్నారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తామని చేయకపోవడం, కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తామని , ప్రభుత్వంలో అన్ని రంగాలకు , సంస్థలకు విస్తరింపచేయడం ఏ విధంగా కార్మిక అనుకూల విధానమని నిలదీశారు.