తెలంగాణ

తెలంగాణలో కాంగ్రెస్ పని ఖతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొర్రూరు, మే 4: ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో చేపట్టి పకడ్బందీగా అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజలకు వరంగా మారాయని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండలపరిషత్, జిల్లాపరిషత్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం తొర్రూరు మండలంలోని నాంచారి మడూరు, వెలికట్టే, చింతలపల్లి, అమ్మాపురం, గూర్తురు, కంఠాయపాలెం, మాటేడు, చర్లపాలెం, చీకటాయపాలెం, హరిపిరాల తదితర గ్రామాల్లో మంత్రి ఎర్రబెల్లి సుడిగాలి పర్యటన నిర్వహించి ఆయా గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు మద్దతుగా నిలువాలని మంత్రి కోరారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ జోరుతో కాంగ్రెస్ పార్టీ పని ఖతం అయిపోయిందని ఎర్రబెల్లి అన్నారు. తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ వ్యాప్తంగా అన్నిగ్రామాల్లో ప్రతీ చెరువును నింపడం ద్వారా రాష్ట్రం మొత్తం కొద్దిరోజుల్లోనే సశ్యశామలం కాబోతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో గతంలో ఒక్క ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిర్మాణానికి 40సంవత్సరాలు దాటినా నేటికీ పూర్తి కాలేదన్నారు. టీఆర్‌ఎస్ పాలనలో కేవలం మూడు సంవత్సరాల్లోనే కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రికార్డు సృష్టించామన్నారు. తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని రాష్ట్ర ప్రజలు గుర్తించాలని తెలంగాణ ప్రజలంతా సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి ధ్యేయం అన్నారు. కేసీఆర్ తన సమర్థవంతమైన పాలనతో తెలంగాణకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారన్నారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం కేంద్రప్రభుత్వ ఏర్పాటులో ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర కీలకం కానుందన్నారు. గిరిజనులకు 12శాతం రిజర్వేషన్‌ల సాధన టీఆర్‌ఎస్ తోనే సాధ్యమని అదేవిదంగా ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయారంగానికి అనుసందానం చేసి నేతలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌పార్టీకి ఓటు వేస్తే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే అవుతుందని ఎర్రబెల్లి అన్నారు. రైతులకు రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి, ఉచితంగా 24గంటల విద్యుత్తు, రైతుబీమా పథకం అమలు చేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అభివృద్ధి చేసే టీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు అండగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పలువురు ఇతర పార్టీ నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సభలలో తొర్రూరు ఎంపీపీ కర్నె సోమయ్య, మండలపార్టీ అధ్యక్షుడు సీతారాములు, జెడ్పీటీసీ అభ్యర్ధి మంగళంపల్లి శ్రీనివాస్, ఆయా గ్రామాల ఎంపీటీసీ అభ్యర్థులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
చిత్రం... ప్రచారంలో భాగంగా మహిళలతో కలిసి బతుకమ్మ ఎత్తుకున్న మంత్రి