తెలంగాణ

బ్యాలెట్లు తారుమారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంస్థాన్‌నారాయణపురం, మే 6: యాదాద్రిభువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలంలోని కంకణాలగూడెం ఎంపీటీసీకి బదులు జనగాం ఎంపీటీసీకి చెందిన బ్యాలెట్లతో అధికారులు ఓట్లు వేయిస్తుండటంతో గమనించిన ఓటర్లు, అభ్యర్థులు పోలింగ్‌ను అడ్డుకున్న సంఘటన సోమవారం కంకణాలగూడెం, కొత్తగూడెం గ్రామాలలో జరిగింది. తీవ్రమైన గందరగోళం మధ్య ఉదయం 9గంటలకు పోలింగ్ నిల్పివేశారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కారు గుర్తు తప్ప బీజేపీ, సీపీఎం, ఇండిపెండెంట్లకు చెందిన ఎవరి గుర్తులూ ఆ బ్యాలెట్లలో లేకపోవడంతో అభ్యర్థులు, ఓటర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి తొత్తులుగా మారిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, తిరిగి రీపోలింగ్ జరపాలని భీష్మించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్, అడిషనల్ డీజీ గోవింద్‌సింగ్, రాచకొండ సీపీ మహేశ్ ఎం. భగవత్, చౌటుప్పల్ ఆర్డీవో సూరజ్‌కుమార్, ఏసీపీ సత్తయ్యలు హుటాహుటిన కంకణాలగూడెం గ్రామానికి చేఠుకున్నారు. పోలింగ్ జరిగినతీరు, తారుమారైన బ్యాలెట్లపై పూర్తిస్థాయిలో విచారణ జరిపారు. కంకణాలగూడెం ఎంపీటీసీ పరిధిలో కంకణాలగూడెం, కొత్తగూడెం, చిమిర్యాల గ్రామాలున్నాయి. ఈ ఎంపీటీసీకి చెందిన బ్యాలెట్లకు బదులు రెండు బుక్కులు జనగాం ఎంపీటీసీ స్థానానికి చెందిన బ్యాలెట్లు తారుమారై వచ్చాయి. ఈవిధంగా వచ్చిన బుక్కులోంచి కంకణాలగూడెంలో 16ఓట్లు, కొత్తగూడెంలో 2 ఓట్ల బ్యాలెట్లతో ఓట్లు వేశారు. ఉదయం 9గంటల సమయంలో కంకణాలగూడెంలో 136, కొత్తగూడెంలో 176 ఓట్లు వేశారు. ఇండిపెండెంట్‌కు ఓటు వేద్దామని వెళ్లిన ఒక ఓటరుకు గ్యాస్ సిలిండర్ గుర్తు కానరాకపోవడంతో బ్యాలెట్ పత్రాలు తారుమారైనట్టు గుర్తించి అధికారులను నిలదీశారు. విషయం తెలుసుకున్న ఇతర ఓటర్లు బ్యాలెట్ పత్రాలను పరిశీలించగా అవి జనగాం గ్రామ ఎంపీటీసీకి చెందినవిగా తెలిసింది. అందులో టీఅర్‌ఎస్‌కు చెందిన కారు గుర్తు మాత్రమే సరిపోగా, మిగిలిన బీజేపీ, సీపీఎం, ఇండిపెండెంట్‌కు చెందిన సిలిండర్ గుర్తు లేకపోవడంతో అభ్యర్థులు, ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్ నిలిపివేశారు. అధికారుల తప్పిదాలపై నిలదీశారు. అధికారులు టీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోయారని ఆరోపించారు. మళ్ళీ రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెం గ్రామంలోనూ ఇదే రీతిన జనగాం బ్యాలెట్ల నుంచి 2 ఓట్లు వేయగానే ఓటర్లు గమనించారు. ఒక ఊరి బ్యాలెట్లు మరో ఊరికి వచ్చినట్టు గుర్తించి ప్రజలు నిలదీశారు. పోలింగ్‌ను అడ్డుకున్నారు. ఇవీ కాకుండా మరికొన్ని బుక్కుల్లో జనగాం, కంకణాలగూడెంలకు చెందిన బ్యాలెట్లు కలిసి ఉన్నాయి. అధికారులు వీటన్నింటినీ పూర్తిగా పరిశీలించారు. తప్పుడుగా వేసిన ఓటర్లను మళ్ళీ పిలిపించి ఓట్లు వేయిస్తామని, రాత్రి ఎంత సమయమైనా ఓట్లు వేసేందుకు అనుమతిస్తామని అభ్యర్థులకు, ఓటర్లకు నచ్చజెప్పారు. అందుకు సమ్మతించడంతో మధ్యాహ్నం 2గంటలకు మళ్ళీ పోలింగ్‌ను ప్రారంభించారు. ఇదిలా ఉండగా సీపీఎం అభ్యర్థి మల్లెపల్లి లలిత, కడ్తాల జయమ్మలు అధికారులు టీఆర్‌ఎస్‌తో కుమ్మక్కై తమకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. కారు గుర్తు తప్ప, తమ గుర్తులు లేకుండా చేశారన్నారు.
బాధ్యులైన అధికారులపై చర్యలు: ఆర్డీవో
బ్యాలెట్ పత్రాలు ఒక ఎంపీటీసీకి బదులు మరో ఎంపీటీసీకి చెందినవి తారుమారు చేసిన అధికారులపై చర్యలు తప్పవని చౌటుప్పల్ ఆర్డీవో సూరజ్‌కుమార్ ప్రకటించారు. సోమవారం ఆయన కంకణాలగూడెం, కొత్తగూడెం గ్రామాలలో బ్యాలెట్లతో జరిగిన అవకతవకలను సరిచేసిన అనంతరం విలేఖరులతో మాట్లాడారు. కొన్ని బ్యాలెట్లు రెండు ఎంపీటీసీల బుక్కులలో ప్రింట్ చేయడం, మరికొన్నింటిని ఒక ఊరికి బదులు, మరో ఊరికి పంపించడం వంటివి జరిగినట్టు గుర్తించామని తెలిపారు. పొరపాట్లు చేసిన అధికారులపై చర్యలకు ఈసీకి, ఉన్నతాధికారులకు సమాచారం అందజేసినట్టు తెలిపారు. అలాగే తారుమారైన బ్యాలెట్లతో ఓట్లు వేసిన 18మందిని పిలిపించి మళ్ళీ ఓట్లు వేయిస్తామని తెలిపారు.
చిత్రాలు.. కంకణాలగూడెంకు బదులు వచ్చిన జనగాం బ్యాలెట్ పత్రాలు
*పోలింగ్ నిల్చిపోవడంతో చెట్లకింద కూర్చున్న ఓటర్లు, *తనకు అన్యాయం చేశారంటున్న సీపీఎం అభ్యర్థి మల్లేపల్లి లలిత
*కంకణాలగూడెంలో ఓటర్లు, అభ్యర్థులతో చర్చిస్తున్న రాష్ట్ర అబ్జర్వర్ గోవింద్‌సింగ్, సీపీ ఎం. భగవత్