తెలంగాణ

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌దే కీలక పాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మే 6: సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించనున్నారని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ధీమా వెలిబుచ్చారు. తెలంగాణాలో తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు యావత్ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. తొలి విడత ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా తన మెట్టినిల్లు అయిన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పోతంగల్ గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత పాత్రికేయులతో మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ ప్రజల అండతో తెరాస పార్టీ దేశ రాజకీయాల్లో ముఖ్య భూమిక పోషించనుందన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తరహాలోనే, ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు తెరాస పార్టీకే బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాదేశిక ఎన్నికల్లో వార్ వన్‌సైడ్‌గా సాగుతోందని, ప్రజలు కేసీఆర్ పాలనకు మద్దతుగా నిలుస్తూ ప్రతి పల్లెలోనూ కారు గుర్తుకు ఓటేసి తెరాస అభ్యర్థులను గెలిపిస్తున్నట్టు ఓటింగ్ సరళి ద్వారా స్పష్టమవుతోందన్నారు. ఎంపీ వెంట తెరాస రాష్ట్ర నాయకులు పోతంగల్ రాంకిషన్‌రావు, మోహన్‌రెడ్డి, అమర్‌నాథ్ బాబు, మండల నాయకులు నర్సింగ్‌రావు, రచ్చ సుదర్శన్, బాలరాజ్ గౌడ్, కిషోర్‌రావు, జడ్పీటీసీ అభ్యర్థి నీరడి సవిత బుచ్చన్న, సాయిలు తదితరులు ఉన్నారు.

చిత్రం...నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పోతంగల్‌లో
ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఎంపీ కవిత