తెలంగాణ

వడదెబ్బకు ఆరుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, ఆత్మకూరు (ఎం), గొల్లపల్లి, మే 6: వడదెబ్బ తాకిడికి తాళలేక తెలంగాణలో ఆరుగురు మృతి చెందారు. సూర్యాపేట జిల్లాలో ఒకరు, యాదాద్రి భువనగిరి జిల్లాలో నలుగురు, జగిత్యాల జిల్లాలో ఒకరు మృతి చెందారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలంలో వివిధ గ్రామాలకు చెందిన ముగ్గురు సోమవారం వడదెబ్బకు గురై మృతి చెందారు. సింగారం గ్రామపంచాయతీ షేరుబాయికి చెందిన వాకిటి దామోదర్‌రెడ్డి (45), లింగరాజుపల్లి గ్రామానికి చెందిన ఎర్ర దామోదర్ రెడ్డి (70), తిమ్మాపురం గ్రామానికి చెందిన ఎండీ. హామీనాబి(82) తీవ్ర వడదెబ్బకు గురై మృతి చెందినట్టు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే బొడ్రాయి బజార్‌కు చెందిన అంతటి యల్లయ్య (80) మూడు రోజుల క్రితం ఎండలో పోస్ట్ఫాసుకు వెళ్లి వ చ్చాడు. ఆ సమయంలో వడదెబ్బతో అస్వస్థతకు గురికాగా ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా ఆదివారం రాత్రి మృతిచెందాడు. అదే జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలోని ఇంద్రియాల గ్రామానికి చెందిన నక్క నర్సింహ (59) వ్యవసాయ కూలీ. సోమవారం ఓటు హక్కును వినియోగించుకుని ఇంటికి వెళ్లి కుప్పకూలాడు. చికిత్స చేస్తుండగా నర్సింహ మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని రాఘవపట్నం గ్రామంలో వడదెబ్బ తగిలి కనకట్ల లక్ష్మీ(45) అనే ఉపాధిహామీ కూలీ సోమవారం మృతి చెందింది. లక్ష్మీ ప్రతిరోజు ఉపాధిహామీ పనికి వెళ్తుండగా ఎండలు అధికంగా ఉండడంతో సోమవారం పనికి వెళ్ళి ఇంటికి వచ్చిన తరువాత వాంతులు చేసుకుంది. దాంతో కుటుంబసభ్యులు జగిత్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది.