తెలంగాణ

కోస్టల్ కంపెనీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములుగుటౌన్, మే 6: ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి రోడ్డులో గల కోస్టల్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దేవాదుల ఎత్తిపోతల పథకం పైప్‌లైన్, టనె్నల్ నిర్మాణ పనులు చేపడుతున్న సబ్ కాంట్రాక్టర్ అయిన కోస్టల్ కంపెనీ పంట పొలాల్లో ఆఫీసును ఏర్పాటు చేసుకొని గత కొన్ని సంవత్సరాలుగా కంపెనీ పనులు, గ్యారేజీ నిర్వహిస్తోంది. కంపెనీ పక్కన ఉన్న పంట పొలాల్లో ఉన్న గడ్డికి గుర్తు తెలియని వ్యక్తులు మంట పెట్టడంతో మంటలు చెలరేగి అవి కంపెనీలోకి వ్యాపించాయి. ఈ క్రమంలో జరిగిన అగ్నిప్రమాదంలో 1500 టైర్లు, రెండు టిప్పర్లు, కేబుల్ వైర్లు, ఎయిర్‌డక్లెయిన్స్, 5 జతల కొత్త టైర్లు, కార్మికులకు అందించే గాలి యంత్రాలు కాలి బూడిదయ్యాయి. కాగా, కోస్టల్ డీజీఎం రమేష్ మాట్లాడుతూ కోస్టల్ కంపెనీ మెగా కంపెనికీ సబ్ కాంట్రాక్టర్‌గా ఉందని సబ్ కాంట్రాక్టర్ కోస్టల్ అగ్రిమెంట్‌ను రద్దు చేయడంతో 2019 జనవరి 20న కంపెనీ నిర్వహణ మొత్తం మెగాకు అప్పగించారన్నారు. ప్రమాద నష్టం రూ. 80 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. అగ్ని ప్రమాదం సమాచారం తెలుసుకున్న ములుగు ఎస్సై బండారి రాజు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అర్పే ప్రయత్నం చేస్తూ అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.
చిత్రం...దగ్ధమవుతున్న టైర్లు, కేబుల్స్