తెలంగాణ

ఓటరు చొక్కాను విప్పించిన పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునగాల, మే 6: సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని బరాఖత్‌గూడెం గ్రామంలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల్లో ఓ ఓటరును పోలీసులు టీ షర్టు విప్పించి ఓటు వేయించిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శీలం శ్రీను ఎర్ర రంగు టీ షర్టును ధరించి ఓటు వేసేందుకు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకుని క్యూలో నిలబడ్డాడు. అతడిని గమనించిన పోలీసులు పార్టీ గుర్తుకు సంబంధించిన రంగు దుస్తులు ధరించి ఓటు వేసేందుకు రావడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని అడ్డుకున్నారు. తనకు ఎన్నికల నియమావళి గురించి తెలియదని బాధితుడు వాదించినప్పటికీ పోలీసులు అతని టీ షర్టును విప్పించిన అనంతరం అనుమతించడంతో పోలీసులకు, శ్రీను, అతడి భార్య మంగమ్మకు మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. మహిళలు ఎర్ర చీరకట్టుకుని వచ్చినా మీరు ఇలా చేస్తారా? అని పలువురు మహిళలు పోలీసుల చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్థులు జోక్యం చేసుకుని పోలీసులకు, బాధితునికి సర్దిచెప్పడంతో వాగ్వాదం సద్దుమణిగింది.
చిత్రం...ఓటరు టీ షర్టును విప్పించిన దృశ్యం