తెలంగాణ

స్థానిక సంస్థలకు రూ. 8 వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 6: తెలంగాణలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు అవసరమైన నిధులు సమకూర్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు రాష్ట్ర ప్రథమ ఆర్థిక కమిషన్ చైర్మన్ జి. రాజేశంగౌడ్ తెలిపారు. హైదరాబాద్ (ఎర్రమంజిల్) లోని ఆర్థిక కమిషన్ కార్యాలయంలో కమిషన్ మెంబర్ సెక్రటరీ సురేష్ చందాతో సోమవారం ఆయన చర్చలు జరిపారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు సొంత వనరుల ద్వారా ఆదాయం సమకూర్చుకునే మార్గాలపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కమిషన్ మధ్యంతర నివేదికలో తెలిపిన విధంగా కేంద్ర ఆర్థిక సంఘం ద్వారా గ్రామీణ స్థానిక సంస్థలకు 1,629 కోట్ల రూపాయలు, పట్టణ స్థానిక సంస్థలకు 1,029 కోట్ల రూపాయలు లభిస్తున్నాయి. అలాగే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద 4,000 కోట్ల రూపాయలు లభిస్తుండగా, స్థానిక సంస్థలు సొంత వనరుల ద్వారా 700 కోట్ల రూపాయలు పొందుతున్నాయని రాజేశం గౌడ్ గుర్తు చేశారు. సొంత వనరులను మరింత పెంచుకోవడంపై స్థానిక సంస్థలు దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందు వల్ల విధానపరమైన అంశాలను వెల్లడించలేకపోతున్నామన్నారు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలు తమ స్థితి గతులను మెరుగుపరచుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.