తెలంగాణ

పోలింగ్ ముగిశాక శాతం ఎలా పెరిగింది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 6 : పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసాక పోలింగ్ శాతం పెరగడం పట్ల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశీధర్‌రెడ్డి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి రజత్‌కుమార్ పాత్రపైనే తమకు అనుమానాలున్నాయని ఆయన ఆరోపించారు. గాంధీభవన్‌లో సోమవారం శశీధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతీ నియోజకవర్గంలో కనీసం 99 వేల ఓట్లు అదనంగా పడ్డాయన్నారు. ఓటింగ్ శాతంపై రజత్‌కుమార్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేశారన్నారు. పోలింగ్ శాతం తేడాలపై తాము ముందునుంచి అనుమానాలు వ్యక్తం చేస్తోన్న ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పడం లేదని ఆయన విమర్శించారు. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌కుమార్ పాత్ర ప్రశ్నార్ధకంగా ఉందని ఆయన విమర్శించారు. పెరిగిన ఓటింగ్ శాతాన్ని తగ్గించి చూపడం వెనుక కుట్ర ఉందన్న అనుమానాలు కలిగిస్తున్నాయని శశీధర్‌రెడ్డి ఆరోపించారు. శాసనసభ ఎన్నికల పోలింగ్ జరిగిన రోజు సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ శాతం 61గా ఎన్నికల అధికారి రజత్‌కుమార్ ప్రకటించారని గుర్తు చేశారు. కానీ ఆ మరుసటి రోజు పోలింగ్ శాతం 72 నమోదు అయినట్టు రజత్‌కుమార్ ప్రకటించారన్నారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల జరిగిన రోజు ప్రకటించిన పోలింగ్ శాతానికి ఆ తర్వాత ప్రకటించిన పోలింగ్ శాతానికి మధ్య తేడా ఉందన్నారు. ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పాత్రపై అన్ని పక్షాలతో త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. ఎన్నికలు కేవలం రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశం కాదని అది ప్రజలకు సంబంధించిన అంశమని శశీధర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల నిర్వహణలో దేశవ్యాప్తంగా అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ అధికార పార్టీకి అనుకూలంగా మారిందని ఆరోపించారు. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.